JioPhone Next: How to Find Out When the
New Phone Will Hit a Store Near You
జియో ఫోన్ నెక్ట్స్ ఎక్కడ, ఎలా
కొనాలి? మీ దగ్గర్లోని స్టోర్‌లో జియోఫోన్ నెక్స్ట్ అందుబాటులోకి
వచ్చిందా? లేదా? వివరాలివే..
భారతీయ మొబైల్ యూజర్లకి సరికొత్త
ఇంటర్నెట్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో జియో సంస్థ కొత్తగా జియోఫోన్ నెక్స్ట్‌ను
తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇతర కంపెనీలకు చెందిన బడ్జెట్ ఫోన్లలో ఉండే
ఫీచర్లతో రూ. 6,499 ధరకే జియోఫోన్ నెక్స్ట్‌ను అందివ్వనున్నట్లు
తెలిపింది. ఇందుకోసం జియో సంస్థ వినియోగదారులకు నాలుగు రకాల ప్లాన్లు అందుబాటులోకి
తీసుకొచ్చింది. మరి నవంబరు 4న విడుదల అవుతున్న ఈ ఫోన్‌ను ఎలా
కొనుగోలు చేయాలి? మీ దగ్గర్లోని స్టోర్‌లో జియోఫోన్
నెక్స్ట్ అందుబాటులోకి వచ్చిందా? లేదా? అనేది ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
* ముందుగా జియో వెబ్‌సైట్‌లోకి
వెళితే జియోఫోన్ నెక్ట్స్ ఫొటో కనిపిస్తుంది. అందులో ‘Know More’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే జియో ఫోన్‌కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది.
* అందులో ‘I am
Interested’ అనే బటన్‌పై క్లిక్ చేసి మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. తర్వాత మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీ
ఎంటర్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతుంది.
* అక్కడ మీ అడ్రస్,
ప్రాంతం, పిన్‌కోడ్ వంటి వివరాలు నమోదు
చేయాలి.
* తర్వాత మీ ప్రాంతంలో
జియోఫోన్ నెక్ట్స్ అమ్మకాలు ప్రారంభమైనప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందనే మెసేజ్
మీ ఫోన్‌కి వస్తుంది.
అలా జియో ఫోన్ అమ్మకాలకు సంబంధించిన సమాచారం ముందుగానే మీకు తెలుస్తుంది.
జియో, గూగుల్
సంయుక్తంగా తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్/ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్ ప్రాసెసర్, 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే,
వెనుక 13 ఎంపీ, ముందు 8 ఎంపీ కెమెరా వంటి పీచర్లున్నాయి. అలానే ఈ ఫోన్ కోసం ఆండ్రాయిడ్
ప్రత్యేకంగా ప్రగతి అనే కొత్త ఓఎస్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఫోన్‌లో వాయిస్
అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్క్రీన్
టెక్ట్స్, 12 భాషల్లోకి అనువదించే లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్
వంటి అదనపు ఫీచర్లు కూడా ఇస్తున్నారు. అలానే ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారి
కోసం జియో నాలుగు ప్లాన్లు ప్రకటించింది. అవి ఆల్వేస్ ఆన్, లార్జ్, ఎక్స్‌ఎల్, డబుల్
ఎక్స్‌ఎల్. వీటితో రీఛార్జి ప్లాన్లు కలిపి ఉంటాయి. ముందుగా రూ. 1,999 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని 18 లేదా 24 నెలల కాల వ్యవధిలో చెల్లించవచ్చు.
0 Komentar