ఈ కలెక్టరు అందరికీ ఆదర్శం
ఈ తరం లో అందరూ పిల్లలను ప్లే స్కూల్లకు
పంపుతున్న ఈ రోజుల్లో కలెక్టరు తన ఇద్దరు కుమార్తెలు నిర్వికరాజ్, రిత్వికరాజ్
లను అంగన్‌వాడీ కేంద్రానికి పంపిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
పైన ఫోటోలో ముందు వరుసలో ఉన్న ఈ
ఇద్దరు చిన్నారులు కుమురం భీం జిల్లా కలెక్టరు రాహుల్ రాజ్ కుమార్తెలు
తన ఇద్దరు చిన్నారులు జన్కాపూర్-1 కేంద్రంలోని
సహచరులతో ఆడుతూపాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. కలెక్టరు పిల్లలు మూడు నెలలుగా
ఇక్కడికి వస్తున్నారని, ఇక్కడే భోజనం చేస్తున్నారని అంగన్‌వాడీ
టీచర్ అరుణ తెలిపారు.
0 Komentar