National Achievement Survey to be held
on November 12
నవంబర్ 12 న దేశవ్యాప్తంగా నేషనల్
అచీవ్మెంట్ సర్వే – 3, 5, 8, 10 తరగతుల విద్యార్ధులకు పరీక్ష
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు,
ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 3, 5, 8, 10వ తరగతి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని
పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబరు 12వ తేదీన నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS) నిర్వహించనుంది.
మొత్తం 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత
ప్రాంతాల్లోని 733 జిల్లాల్లో ఉన్న 1.23 లక్షల పాఠశాలల్లో చదువుతున్న 38 లక్షల
మంది విద్యార్థుల ప్రతిభా పాటవాలను ఈ సర్వే ద్వారా అంచనా వేయనున్నారు. ప్రతి
మూడేళ్లకోసారి నిర్వహించే సర్వే చివరి సారిగా 2017 నవంబర్ 13న జరిగింది.
2021 నవంబర్ 12న నిర్వహించబోయే
సర్వేలో కొవిడ్ కారణంగా పిల్లల చదువులకు ఎదురైన ఇబ్బందులు, కొత్తగా
నేర్చుకున్న అంశాలను గుర్తించనున్నారు. 3, 5 తరగతుల
విద్యార్థుల సామర్థ్యాన్ని భాష, గణితం, ఈవీఎస్ అభ్యాస విషయంలో లెక్కిస్తారు. 8వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని
భాష, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో పరీక్షిస్తారు. 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని
ఇంగ్లిష్, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో అంచనావేస్తారు. ఇందుకోసం తెలుగు, ఇంగ్లిష్, హిందీతోపాటు మొత్తం 22 భాషల్లో పరీక్ష
నిర్వహించనున్నారు.
NAS 2017: NATIONAL ACHIEVEMENT SURVEY REPORTS 👇
SCERT, AP – NAS 2021 – 12th November,
2021 - Useful Documents 👇
0 Komentar