Netflix Introduces 5 Mobile Games,
including a Couple Based on Stranger Things
నెట్‌ఫ్లిక్స్ మరో కొత్త సర్వీస్: ఉచిత
మొబైల్ గేమ్స్.. ప్రస్తుతం ఉన్న గేమ్స్‌వివరాలు ఇవే
లాక్‌డౌన్‌ల పుణ్యమా అని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలకు ఆదరణ పెరిగింది. ఈ రంగంలో అనేక యాప్‌లు పుట్టుకొచ్చాయి. దీంతో పోటీ తీవ్రమైంది. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అదించేందుకు పోటీ పడుతున్నాయి. అనేక సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా నెట్‌ఫ్లిక్స్ మరో కొత్త సర్వీస్‌తో యూజర్స్‌ని అలరించేందుకు సిద్ధమైంది.
ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్.. మొబైల్ గేమ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఇవి ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండన్నాయి. స్ట్రేంజర్ థింగ్స్: 1984(బోనస్‌ఎక్స్‌పీ); స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్(బోనస్‌ఎక్స్‌పీ); షూటింగ్ హూప్స్ (ఫ్రాస్టీ పాప్); కార్డ్ బ్లాస్ట్ (అమ్యూజో అండ్ రోగ్ గేమ్స్); టీటర్ అప్ (ఫ్రాస్టీ పాప్).. ఈ ఐదు మొబైల్ గేమ్స్ ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్ వేదికపై అందుబాటులో ఉండనున్నాయి. భవిష్యత్తులో మరిన్ని గేమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపింది.
ఈ గేమింగ్ సేవలకు ప్రత్యేకంగా
ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. పైగా ఎలాంటి
ప్రకటనలు కూడా ఉండవని పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి లాగిన్ కాగానే.. ప్రత్యేకంగా
ఓ గేమ్స్ వరుస తెరపై కనిపిస్తుంది. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ట్యాబ్‌లలోనూ ప్రత్యేక గేమ్స్ వరుస లేదా డ్రాప్ డౌన్ మెనూలో గేమ్స్
అనే ఆప్షన్ ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న అనేక భాషల్లో ఈ గేమ్స్‌ను
ఆడొచ్చు. ఒకవేళ ఏదైనా భాష లేకపోతే ఇంగ్లిష్ డిఫాల్ట్‌గా ఉంటుంది. అయితే, పిల్లల
భద్రత దృష్ట్యా కిడ్స్ ప్రొఫైల్స్‌లో ఈ గేమ్స్ అందుబాటులో ఉండవు.
🎮📱 Let the Games Begin📱🎮
— Netflix Geeked (@NetflixGeeked) November 2, 2021
Tomorrow, Netflix Games will start rolling out on the Netflix mobile app. First on Android, with iOS on the way.
It’s early days, but we’re excited to start bringing you exclusive games, with no ads, no additional fees and no in-app purchases. pic.twitter.com/ofNGF4b8At
0 Komentar