Now get Aadhaar verification done
offline, users get power to revoke eKYC consent
ఇక ఆఫ్‌లైన్‌లోనూ ఆధార్ పరిశీలన - ఈ-కేవైసీ సమ్మతి ఉపసంహరణ అధికారం వినియోగదారులకే..
ఆధార్‌కార్డుల పరిశీలనను
(వెరిఫికేషన్) ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు
ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) జారీచేసిన డిజిటల్ సంతకంతో కూడిన పత్రాన్ని
సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో సంబంధిత ఆధార్ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలు, పేరు,
చిరునామా, లింగం, పుట్టిన
తేదీ, ఆధార్ కార్డుదారుడి ఫొటో వంటివి ఉంటాయి. ఈ మేరకు
కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీచేసింది. ‘ది ఆధార్ (అథెంటిఫికేషన్ అండ్
ఆఫ్‌లైన్ వెరిఫికేషన్) నిబంధనలు-2021’ని ప్రభుత్వం ఈ నెల 8న జారీచేయగా, మంగళవారం అధికారిక వెబ్‌సైట్‌లో
ఉంచింది.
ఇందులో ఆధార్ ఆఫ్‌లైన్ పరిశీలనకు
సంబంధించి సవివర ప్రక్రియను పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆధార్ కార్డుదారుడి
డిజిటల్ సంతకంతో కూడిన పత్రాన్ని ఈ-కేవైసీ నిమిత్తం ధ్రువీకృత సంస్థకు సమర్పించే
ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఆఫ్‌లైన్ ప్రక్రియతో పాటు ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్), బయోమెట్రిక్
ఆధారిత ధ్రువీకరణ తదితర విధానాలు కొనసాగుతాయి. సంబంధిత సంస్థలు వీటిలో ఏదో
ఒకదానిని లేదా మరింత భద్రత నిమిత్తం ఒకటి కంటే ఎక్కువ విధానాలను ఉపయోగించి ఆధార్
సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు.
0 Komentar