Ola Begins Pilot of Quick Grocery
Delivery Service
ఓలా స్టోర్ - సరుకుల డెలివరీ - బెంగళూరులో
‘ఓలా స్టోర్’ పైలట్ ప్రాజెక్టు
ఓలా సంస్థ సరుకుల డెలివరీ రంగంలోకి
అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తాజాగా బెంగళూరులో ‘ఓలా స్టోర్’ పేరిట పైలట్
ప్రాజెక్టు ప్రారంభించింది. నిత్యావసర సరకులు, పర్సనల్ కేర్, పెట్ కేర్ వంటి వస్తువులు అందించనుంది. ప్రస్తుతం బెంగళూరులోని కీలక
ప్రాంతాల్లో మాత్రమే ప్రారంభమైన ఈ సేవలు త్వరలో ఇతర ప్రధాన నగరాలకూ విస్తరించనున్నట్లు
సంబంధిత వర్గాలు తెలిపాయి. 15 నిమిషాల్లో సరకులు అందించాలని
లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాయి. ఓలా యాప్‌లోనే ఓలా స్టోర్ సేవలు కూడా
అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ కేటగిరీల్లో మొత్తం 2,000 సరకులు అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటి
వరకు దీనిపై ఓలా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
సంప్రదాయ ఇ-కామర్స్ సంస్థల ద్వారా
ఆర్డర్ చేసే వస్తువుల డెలివరీకి కనీసం ఒకరోజైనా పడుతోంది. దీనికి
ప్రత్యామ్నాయంగానే ఇప్పుడు దేశంలో క్విక్-కామర్స్(క్యూ-కామర్స్)కి ఆదరణ
పెరుగుతోంది. ఇంట్లో నిత్యం వాడే వంట సరకులు, ఆహార పదార్థాలు, స్టేషనరీ వస్తువులను నిమిషాల వ్యవధిలో ఇంటికి చేర్చాలన్నదే వీటి లక్ష్యం.
ఇప్పటికే ఈ రంగంలో డుంజో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి
సంస్థలు సేవలు అందిస్తున్నాయి. తాజాగా ఓలా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. రెడ్‌సీర్
నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో 0.3 బిలియన్
డాలర్లుగా ఉన్న క్యూ-కామర్స్ పరిశ్రమ విలువ 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందే అవకాశం ఉంది.
0 Komentar