Here are Four Easy Ways to Find Out Your
PF Balance
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను
తెలుసుకోవడానికి నాలుగు సులభమైన మార్గాలు ఇవే
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)
చందాదారులకు దీపావళికి ముందు తీపి కబురు అందిన విషయం తెలిసిందే. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.5% వడ్డీ
జమ కానుంది. ఈ నిర్ణయంతో ఐదు కోట్ల మందికి పైగా పీఎఫ్ చందాదారులకు లబ్ధి
చేకూరనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కూడా పీఎఫ్
డిపాజిట్లపై 8.5% వడ్డీ అందింది. అంతకుముందు ఏడాది (2018-19)లో అది 8.65%గా ఉంది. అయితే, మీ
పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి నాలుగు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో
చూద్దాం...
1. ఈపీఎఫ్‌వో పోర్టల్..
ఈపీఎవో సభ్యత్వ పోర్టల్‌లో
రిజిస్టర్ చేసుకున్న సభ్యులు www.epfindia.gov.in వెబ్‌సైట్‌కు
వెళ్లి కూడా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘అవర్ సర్వీసెస్’లోని
‘మెంబర్ పాస్‌బుక్’ విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు యూఏఎన్ నంబర్,
పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం కోసం మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
వివరాలు ఎంటర్ చేయడం ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.
2. మిస్డ్ కాల్ సర్వీస్..
ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్ చేసుకున్న
మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు
మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్‌కాల్
ఇచ్చిన తర్వాత ఓ రింగ్ అయి వెంటనే కాల్ కట్ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్
వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో ప్రత్యక్షమవుతాయి.
3. ఉమంగ్ యాప్..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన
ఉమంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే వీలుంది. అందుకోసం ఉమాంగ్
యాప్‌లోని ఈపీఎఫ్‌వోను ఎంచుకోవాలి. అందులో ‘ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్’
విభాగంలోకి వెళ్లి ‘వ్యూ పాస్‌బుక్’ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్ నంబర్‌తో
పాటు మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు
కనిపించే మెంబర్ ఐడీని క్లిక్ చేయడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను పొందొచ్చు.
అయితే,
మీ పీఎఫ్ ఖాతాతో మొబైల్ నంబర్ ముందే జత చేసి ఉండాలి.
4. ఎస్‌ఎమ్మెస్ ద్వారా..
యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న
చందాదారులు ఈపీఎఫ్ ఖాతాకు జత చేసిన మొబైల్ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 77382 99899 నంబర్‌కు ఎస్సెమ్మెస్
పంపించాలి. ప్రస్తుతం ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ
తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్సెమ్మెస్ పంపించాలి.
0 Komentar