SBI Credit Card to Charge Processing Fee
on All EMI Purchases from Dec 1
డిసెంబరు 1
నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు EMIలపై ప్రాసెసింగ్ ఫీజు
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఏదైనా కొని.. దానికి ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే మరికొద్ది రోజుల్లో ఈ చెల్లింపులు మరింత భారం కానున్నాయి. డిసెంబరు 1 నుంచి క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.99(ట్యాక్సులు అదనం) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వెల్లడించింది. ఈ మేరకు క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఈ-మెయిల్ సందేశం పంపింది.
‘‘డిసెంబరు 1, 2021 నుంచి మర్చెంట్ ఈఎంఐ లావాదేవీలపై రూ.99(+ పన్నులు) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయనున్నాం. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని మర్చంట్ అవుట్‌లెట్లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, యాప్‌లలో జరిపే ఈఎంఐ లవాదేవీలకు ఈ ఫీజు వర్తిస్తుంది’’ అని ఎస్‌బీఐ వెల్లడించింది. అంటే.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొని ఈఎంఐగా మార్చుకుంటే ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిర్ణయంతో ఈఎంఐ ఆప్షన్ వినియోగించుకోవాలనుకునే కస్టమర్లకు మరింత భారం పడనుంది.
ఉదాహరణకు.. మీరు ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో మొబైల్ ఫోన్ కొని దానికి ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి.. ఆ చెల్లింపులను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో చేస్తే మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా రూ.99 ప్లస్ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు మీ క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో ఈఎంఐ అమౌంట్‌తో కలిపి కన్పిస్తుంది. ఈఎంఐగా మార్చుకునే లావాదేవీలకు మాత్రమే ఈ ఫీజును ఛార్జ్ చేస్తారు. అయితే ఈఎంఐ లావాదేవీ రద్దయితే ఈ ఫీజును తిరిగి ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.
అయితే ఈ ప్రాసెసింగ్ ఫీజుకు..
కార్డు ఇంట్రెస్ట్ ఛార్జీలకు ఎలాంటి సంబంధం లేదు. కొన్ని సార్లు ఈఎంఐలకు
మార్చుకున్నప్పుడు విక్రయదారులు వడ్డీలపై డిస్కౌంట్లు కల్పిస్తారు. జీరో కాస్ట్
ఈఎంఐ సదుపాయం ఉంటుంది. అలాంటి వాటికి కూడా ఈ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎస్‌బీఐ
వెల్లడించింది.
0 Komentar