SBI Launches Video Life Certificate for
Pensioners: Here Is How to Use It
వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్
సేవలు అందిస్తున్న ఎస్‌బీఐ
ప్రతి ఏడాది నవంబర్ 1
నుంచి పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌ను (జీవిత ధృవీకరణ పత్రం) సమర్పించాలి. పెన్షన్ ద్వారా ఆదాయం పొందుతున్న వారు.. ఖాతా
ఉన్న బ్యాంకులో గాని, పోస్టాఫీసు నందు గాని, వారికి సంబంధించిన పెన్షన్ ఆఫీసునందు లేదా జీవన్ ప్రమాణ్ పోర్టల్ లో
లైఫ్‌సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇది పెన్షనర్లందరికి తెలిసిందే. ఈసారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన బ్యాంకులో ఖాతా ఉన్న పెన్షన్‌దారులకు
వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే అవకాశం ఇస్తుంది.
ఎస్‌బీఐ భారతదేశంలో మొట్టమొదటిగా `వీడియో లైఫ్ సర్టిఫికేట్ (వీఎల్‌సీ)` సేవను నవంబర్ 1, 2021 నుంచి ప్రారంభించనుంది. ఇది పెన్షన్‌దారులు తమ ఇంటి వద్ద నుంచే సులభంగా వీడియో కాల్ ద్వారా వారి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే అవకాశమిస్తుంది. పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సాధారణ వీడియో కాల్ ద్వారా సమర్పించవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. దాదాపు 1 నిమిషం నిడివి గల వీడియోను ఎస్‌బీఐ తన అధికారిక ట్వట్టర్‌లో షేర్ చేస్తూ దశలవారీ ప్రక్రియను వివరించింది.
ఎస్‌బీఐ పెన్షనర్లు వీడియో కాల్
ద్వారా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించే దశలవారీ గైడ్
⓵ ఎస్‌బీఐ
పెన్షన్ సేవా పోర్టల్‌ని సందర్శించండి.
⓶ జీవిత
ధృవీకరణ పత్ర ప్రక్రియను ప్రారంభించడానికి `వీడియోఎల్‌సీ`పై క్లిక్ చేయండి.
⓷ మీ ఎస్‌బీఐ
పెన్షన్ ఖాతా నెంబర్ సంఖ్యను నమోదు చేయండి, అనంతరం మీ రిజిస్టర్డ్
మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)ని నమోదు చేయండి.
⓸ నిబంధనలు, షరతులు
చదివి అంగీకారం తెలిపి `స్టార్ట్ జర్నీ`పై క్లిక్ చేయండి.
⓹ మీ
ఒరిజినల్ `పాన్` కార్డ్‌ని చేతిలో ఉంచుకుని `ఐ ఆమ్ రెడీ`పై క్లిక్ చేయండి.
⓺ వీడియో
కాల్ ప్రారంభించడానికి మీరు అనుమతి ఇచ్చిన తర్వాత, ఎస్‌బీఐ
అధికారి అందుబాటులోకి వస్తారు. తదుపరి మీ ఇద్దరి మధ్య పరస్పర మాటలు మొదలవుతాయి.
⓻ వీడియో
కాల్‌లోకి వచ్చిన ఎస్‌బీఐ అధికారి మీ స్క్రీన్‌పై ఉన్న 4
అంకెల ధృవీకరణ కోడ్‌ను చదవమని మిమ్మల్ని అడుగుతారు. మీరు ఆ కోడ్ చెప్పవలసి
ఉంటుంది.
⓼ ఇపుడు మీ `పాన్` కార్డ్‌ని బ్యాంక్ అధికారికి చూపించి, దానిని ఫోటో తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. అనంతరం ఎస్‌బీఐ అధికారి మీ `ఫోటో`ను కూడా తీసుకోంటారు. ఇంతటితో వీడియో లైఫ్ సర్టిఫికేట్ (వీఎల్‌సీ) ప్రక్రియ పూర్తవుతుంది.
ఏ కారణం చేతనైనా ఈ `వీడియో
లైఫ్ సర్టిఫికేట్` (వీఎల్‌సీ) ప్రక్రియ తిరస్కరణకు
గురైతే, బ్యాంకు `ఎస్ఎంఎస్` ద్వారా మీకు తెలియచేయబడుతుంది. మీరు ప్రత్యామ్నాయంగా జీవిత ధృవీకరణ
పత్రాన్ని సమర్పించడానికి మీ పెన్షన్ చెల్లింపు శాఖనుగాని, పెన్షన్ పొందే బ్యాంకు శాఖను సందర్శించి అక్కడ జీవిత ధృవీకరణ పత్రాన్ని
అందచేయాలి.
PENSION SEVA - VIDEO LIFE
CERTIFICATE LINK
Now submit your #LifeCertificate from the comfort of your home! Our #VideoLifeCertificate service launching on 𝟏𝐬𝐭 𝐍𝐨𝐯 𝟐𝟎𝟐𝟏 will allow pensioners to submit their life certificates through a simple video call.#SBI #Pensioner #AzadiKaAmritMahotsav #AmritMahotsav pic.twitter.com/SsyJjnCPlL
— State Bank of India (@TheOfficialSBI) October 29, 2021
0 Komentar