Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Warns Against Fraudulent Customer Care Numbers, Gives Instructions to Avoid Getting Scammed

 

SBI Warns Against Fraudulent Customer Care Numbers, Gives Instructions to Avoid Getting Scammed

కస్టమర్ కేర్ నంబర్‌ల గురించి SBI హెచ్చరిక – మోసపోకుండా ఉండటానికి సూచనలు ఇవే

మనకు ఏ సమాచారం కావాలన్న గూగుల్‌ సెర్చ్‌ చేయడం సాధారణమైపోయింది. చివరకు సంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకుల కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం కూడా ఆయా అధికారిక సైట్లకు వెళ్లకుండా గూగుల్‌లోనే వెతుకుతున్నాం. అయితే మిగతా వాటి సంగతి పక్కనబెడితే.. బ్యాంకింగ్‌ విషయంలో అలా చేయడం తప్పంటోంది దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI). తప్పుడు కస్టమర్‌ కేర్‌ నంబర్లతో మోసాల బారిన పడే ప్రమాదం ఉందని ఖాతాదారులను హెచ్చరిస్తోంది. 

మోసపూరిత కస్టమర్‌ కేర్‌ సెంటర్ల వలలో పడి ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను షేర్‌ చేస్తే ఖాతాలో డబ్బు పోగొట్టుకునే అవకాశముందని ఎస్‌బీఐ వెల్లడించింది. దీనిపై అవగాహన కల్పిస్తూ ఓ వీడియోను తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘‘మోసపూరిత కస్టమర్‌ కేర్‌ నంబర్లతో జాగ్రత్త. సరైన కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం దయచేసి ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించండి. బ్యాంకింగ్‌కు సంబంధించిన రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోకండి’’ అని ఖాతాదారులను హెచ్చరించింది. నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లకు సంబంధించి ఎస్‌బీఐ గతంలో కూడా ఇలాంటి హెచ్చరికలు చేసింది.

OFFICIAL WEBSITE CUSTOMER CARE DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags