'Stock Up', China's Dire Warning to
Citizens Amid Tight Covid Curbs
నిత్యావసరాలు నిల్వ చేసుకోండి..
ప్రజలకు చైనా హెచ్చరిక..!
వింటర్ ఒలింపిక్స్-2022 సందర్భంలో
కరోనా ఆంక్షలు కఠినతరం
ఒక్క కరోనా కేసు వచ్చినా చైనా ఉలిక్కిపడుతోంది. కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్ వైపు మొగ్గుచూపుతోంది. ఇటీవల కాలంలో ఆ దేశంలో పదుల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండటంతో.. నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు ఇబ్బంది ఎదురుకాకుండా నిత్యవసరాలను స్టాక్ పెట్టుకోవాలని సూచించింది. పంపిణీకి ఏ మాత్రం అవాంతరం కలగకూడదని అధికారులను అప్రమత్తం చేసింది. సోమవారం రాత్రి అందుకు సంబంధించిన ఉత్తర్వులు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి.
‘రోజువారీ అవసరాలు, అత్యవసర పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజలు నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకోవాలి’ అని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అయితే ఈ ప్రకటనకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తే ప్రజలు ఇబ్బంది ఎదుర్కోకుండా ముందు జాగ్రత్తగా ఈ సూచన చేసిందని కొందరు భావిస్తున్నారు. మరికొందరు ఆహార కొరత గురించి మాట్లాడుతున్నారు. గత రెండేళ్ల కాలంలో సంభవించిన వరదలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. దాంతో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయి. వేగంగా సంభవిస్తోన్న పర్యావరణ మార్పులు ఈ పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
కొవిడ్ విషయంలో జీరో టోలరెన్స్
విధానాన్ని అనుసరిస్తోన్న చైనా.. కేసులు ఏ మాత్రం పెరుగుతున్నాయని అనిపించినా, తక్షణ
చర్యలకు ఉపక్రమిస్తోంది. సరిహద్దుల మూసివేత, లక్షిత లాక్‌డౌన్లు,
సుదీర్ఘ క్వారంటైన్లు అమలు చేస్తోంది. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు
ఏమాత్రం ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈసారి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు
తెలుస్తోంది. ఆ దేశంలో సోమవారం 92 మందికి పాజిటివ్‌గా తేలింది. సెప్టెంబర్ నుంచి
ఇవే అత్యధిక రోజువారీ కేసులు కావడం గమనార్హం.
0 Komentar