Telugu Girl Reshma Kosaraju Wins
Children’s Climate Prize in the US
‘చిల్డ్రన్స్ క్లైమేట్
ప్రైజ్’ విజేత అమెరికాలోని తెలుగు బాలిక రేష్మా కోసరాజు
ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చు ఓ
పెద్ద సమస్యగా మారింది. ఈ ముప్పుతో లక్షలాది ఎకరాల్లోని అడవులు కాలి
బూడిదవుతున్నాయి. వేలాది జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి అడవికి
నిప్పంటుకుంటే దాన్ని ఆర్పేయడం ఎవరితరం కావడం లేదు. దీంతో ఆయా దేశాలు తలలు
పట్టుకుంటున్నాయి. కాగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ.. అమెరికాలో స్థిరపడ్డ 15
ఏళ్ల తెలుగు బాలిక ముందుకొచ్చింది.
ఏఐ టెక్నాలజీతో కార్చిచ్చును
మందుగానే అంచనా వేయొచ్చంటూ బాలిక రేష్మా కోసరాజు ఓ ప్రాజెక్టును రూపొందించింది.
దాదాపు 90 శాతం కచ్చితత్వంతో కార్చిచ్చును ఇది అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు 2021 ఏడాదికి గాను ఉత్తమ చిల్డ్రన్ క్లైమేట్ ప్రైజ్‌ను దక్కించుకుంది.
రేష్మా కుటుంబం కొన్నేళ్లుగా అమెరికాలో స్థిరపడింది.
Special episode of the ‘Young Minds’ podcast — young innovators discussing technology and sustainability with Sarah Maston, founder of Project 15 from Microsoft https://t.co/5Q3v8cWphV pic.twitter.com/mcl8VxfQPp
— CCPrize (@CCPrize) November 10, 2021
0 Komentar