TS: Supplying of 1.14 LMTs Sannabiyyam
under State pool for the schemes of MDM, Hostels and Welfare Institutions
టిఎస్: మధ్యాహ్న
భోజన పథకంతో పాటు వసతి గృహాల్లో వినియోగించే బియ్యం గురించి ప్రభుత్వ ఉత్తర్వులు
జారీ
మధ్యాహ్న భోజన పథకంతో పాటు వసతి గృహాల్లో వినియోగించే సన్నబియ్యంలో నూకల శాతాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల కోసం ఏటా 1.14 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తోంది. సాధారణంగా ఆ బియ్యంలో 25 శాతం నూకలు ఉంటాయి. ఇక నుంచి బియ్యంలో నూకలు పది శాతం మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది.
కరోనా సమయంలో పాఠశాలలు, వసతి గృహాల్లో 1.38 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం నిల్వలున్నాయి. ఆ బియ్యం చెడిపోయే ప్రమాదం ఉండటంతో కొంత రేషన్ కార్డుదారులకు పంపిణీ చేశారు. ఇంకా 80 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలున్నాయి. ఆ బియ్యాన్ని కూడా పది శాతం నూకలకు అప్ గ్రేడ్ చేయించాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం పౌరసరఫరాల శాఖ అధికారులతో కమిటీ వేసింది. ఆ కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకు క్వింటాకు రూ.140 అదనంగా మిల్లర్లకు ఇవ్వాలని నిర్ణయించి ప్రభుత్వం నవంబరు 16న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
CA, F & CS Department - Civil
Supplies - Procurement of Sannabiyyam and Upgradation of CMR to the required
specifications for supplying of 1.14 LMTs Sannabiyyam under State pool for the
schemes of MDM, Hostels and Welfare Institutions - Permission accorded - Orders
- Issued.
G.O.Ms.No. 18 Dated: 16-11-2021
0 Komentar