TS WDCW Recruitment: Apply for 275
Extension Officer Grade-II (Supervisor Gr.II) Posts
టిఎస్: మహిళా, శిశు సంక్షేమ విభాగంలో 275 ఖాళీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఆధ్వర్యంలోని వరంగల్ ప్రాంత పరిధిలో మహిళా, శిశు సంక్షేమ విభాగం
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం జోన్లల్లో ఖాళీలు: 275
ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు.
జోన్ల వారీగా ఖాళీలు:
జోన్-01: కాళేశ్వరం-56
జోన్-02: బాసర-68
జోన్-03: రాజన్న-72
జోన్-04: భద్రాద్రి-79
అర్హత: నిబంధనల ప్రకారం అభ్యర్థులు
ఎస్సెస్సీ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అంగన్‌వాడీ టీచర్లు(మెయిన్,
మినీ)/ కోఆర్డినేటర్లు/ ఇన్స్ట్రక్టర్లు(అంగన్‌వాడీ ట్రెయినింగ్
సెంటర్లు, మిడిల్ లెవల్ ట్రెయినింగ్ సెంటర్లు)/ కాంట్రాక్ట్
సూపర్‌వైజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 50
ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్షలో మెరిట్
ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో 90
ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు వస్తాయి. అందుకు 45 మార్కులు
కేటాయించారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. బాల సేవిక్
ట్రెయినింగ్ కు సంబంధించి మరో 5 మార్కులు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, మంచిర్యాల,
కరీంనగర్, జగిత్యాల, వరంగల్,
ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: రూ.200 ఆన్లైన్లో దరఖాస్తు
రుసుం చెల్లించాలి.
దరఖాస్తు చివరి తేది: 27.11.2021
English
ReplyDelete