UIDAI Finally Gets Powers to Act Against
Aadhaar Violations, Impose Fines Up to Rs 1 Crore
ఉడాయ్‌కి ఆధార్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం -
గరిష్ఠంగా రూ. కోటి వరకు జరిమానా
ఆధార్ వినియోగంలో ఉల్లంఘనలు
జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ వ్యవస్థను
నిర్వహిస్తోన్న ఆధార్ ప్రాధికార సంస్థ ‘ఉడాయ్’కు ఆధార్ ఉల్లంఘనలపై చర్యలు
తీసుకునే అధికారాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది.
కేంద్రం ఇచ్చిన అధికారంతో ఉడాయ్
సంస్థ ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి
గరిష్ఠంగా రూ. కోటి వరకు జరిమానా విధించవచ్చు. ఫిర్యాదుల పరిశీలనకు న్యాయధికారులను
నియమించుకునే అవకాశం కూడా ఉడాయ్‌కే ఉంటుంది. కాగా.. న్యాయాధికారులు విధించిన
జరిమానాలపై అప్పీలు చేసుకోవాలంటే టెలికాం వివాదాల పరిష్కారాల ట్రైబ్యునల్..
అప్పిలేట్ అథారిటీగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
0 Komentar