UK unveils commemorative Mahatma Gandhi
coin to mark Diwali
మహాత్మాగాంధీకి బ్రిటన్ ఘన నివాళి -
దీపావళి వేళ స్మారక నాణెం విడుదల – ఈ వెబ్‌సైట్‌లో విక్రయాలు
మహాత్మాగాంధీని బ్రిటన్ ప్రభుత్వం
గొప్పగా స్మరించుకుంది! దీపావళి పర్వదినం పురస్కరించుకుని బాపూజీ జీవితం, ఆశయాలను
ప్రతిబింబిస్తూ.. కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక
నాణెన్ని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ గురువారం ఆవిష్కరించారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన ప్రభావవంతమైన నాయకుడికి ఇది ఘనమైన
నివాళి అని సునక్ పేర్కొన్నారు.
‘దీపావళి సందర్భంగా ఈ నాణెన్ని
ఆవిష్కరించడం గర్వంగా ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ కీలకపాత్ర పోషించారు.
ఈ క్రమంలో మహాత్ముడి జీవితాన్ని స్మరించుకుంటూ మొదటిసారి బ్రిటన్ నాణెం
రూపొందించడం అద్భుతంగా ఉంది’ అని వివరించారు. ఈ ఏడాది భారత్ ‘ఆజాదీకా అమృత్
మహోత్సవ్’ జరుపుకొంటున్న ప్రత్యేక సందర్భంలో.. ఈ స్మారక నాణెం ఇరు దేశాల మధ్య
శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికి ప్రతీకగా నిలుస్తుందని
చెప్పారు.
రాయల్ మింట్ వెబ్‌సైట్
విక్రయాలు..
హీనా గ్లోవర్ అందించిన ఆకృతిలో
రూపొందించిన ఈ స్మారక నాణెంలో భారత జాతీయ పుష్పం కమలం పువ్వుతోపాటు గాంధీ ప్రముఖ
సూక్తుల్లో ఒకటైన ‘మై లైఫ్ ఇజ్ మై మెసేజ్’ను పొందుపరిచారు. బంగారం, వెండితోపాటు
ఇతర రకాల్లోనూ ఇది అందుబాటులో ఉంది. గురువారం నుంచి బ్రిటన్ రాయల్ మింట్ వెబ్‌సైట్‌లో
వీటిని అమ్మకానికి పెట్టారు. 20వ శతాబ్దపు గొప్ప వ్యక్తుల్లో
ఒకరైన మహాత్మాగాంధీని స్మారక నాణెంతో గౌరవించడం గర్వంగా ఉందని రాయల్ మింట్ ఈ
సందర్భంగా పేర్కొంది.
Today I’ve unveiled a new commemorative £5 coin with the @RoyalMintUK to celebrate the life and legacy of Mahatma Gandhi.
— Rishi Sunak (@RishiSunak) November 4, 2021
The striking design features India’s national flower and one of Gandhi’s most famous quotes.
Read more: https://t.co/C6fyvzIII4 pic.twitter.com/yw3PGvmIlA
Would you like to see our new coin celebrating Mahatma Gandhi being made? Here it is!
— The Royal Mint (@RoyalMintUK) November 4, 2021
Discover Heena Glover's design inspiration: https://t.co/m2MflDm5s0 #Diwali #Gandhi pic.twitter.com/yNkRMhwvYp
0 Komentar