WhatsApp Might Extend Time Limit For
'Delete for Everyone' Feature
వాట్సాప్ కొత్త ఫీచర్ -
తాజాగా డిలీట్ ఫర్ ఎవ్రీన్‌వన్ ఫీచర్ టైమ్ లిమిట్ అప్డేట్ ఇదే
యూజర్స్‌కి మెరుగైన సేవలు
అందించడంలో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయడంతోపాటు వినియోగంలో ఉన్న
ఫీచర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త హంగులు జోడిస్తుంది. తాజాగా డిలీట్ ఫర్ ఎవ్రీన్‌వన్
ఫీచర్ టైమ్ లిమిట్‌ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ మెసేజ్
పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజ్‌తోపాటు అవతలి వ్యక్తుల చాట్ పేజ్
నుంచి సదరు మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు.
ప్రస్తుతం మెసేజ్ పంపిన గంటలోపు మాత్రమే ఇరువురి చాట్ పేజ్ నుంచి మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు. గంట దాటితే పంపిన వ్యక్తి పేజ్ నుంచి మాత్రమే డిలీట్ అవుతుంది. త్వరలో తీసుకొస్తున్న ఫీచర్‌తో నెలరోజుల తర్వాత కూడా యూజర్ తాను పంపిన మెసేజ్‌ని ఛాట్ పేజ్ నుంచి డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో(వాబీటాఇన్ఫో) తెలిపింది.
వాట్సాప్ 2017లో డిలీట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. అప్పట్లో మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్
7 నిమిషాలుగా ఉండేది. తర్వాత మూడు కొత్త టైమ్ లిమిట్‌లను
పరిచయం చేసింది. అవి గంట, 8 నిమిషాలు, 16 సెకన్లు. అంటే యూజర్ మెసేజ్ పంపిన తర్వాత అందులో ఏవైనా తప్పులుంటే పైన
పేర్కొన్న కాలపరిమితిలోపు వాటిని డిలీట్ చేస్తే అవతలివారు వాటిని చూడలేరు. అలానే
వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
వాబీటాఇన్ఫో తెలిపిన దాని ప్రకారం
వాట్సాప్ కొత్తగా వీడియో ప్లేబ్యాక్ ఇంటర్‌ఫేస్‌ను తీసుకొస్తుందట. ఇందులో
యూట్యూబ్ లింక్‌లు వాట్సాప్‌లో షేర్ చేసినప్పడు వాటిని పాజ్ చేయడంతోపాటు పూర్తి
స్క్రీన్‌లో వీడియోను ప్లే చేసేలా దీన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ట్రయల్స్
కోసం గత నెలలో ఆండ్రాయిడ్ బీటా యూజర్స్‌కి ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. తాజాగా ఐఓఎస్
బీటా యూజర్స్ కూడా ఈ ఫీచర్‌ను పరీక్షించవచ్చని వాబీటాఇన్ఫో తన కథనంలో పేర్కొంది.
150k followers today. Thank you so much 🥺
— WABetaInfo (@WABetaInfo) November 1, 2021
There is good news to celebrate this event 💚
WhatsApp beta for Android 2.21.23.1: what’s new?
Spotted a new version of "delete message for everyone", under development for a future update, without time limits!https://t.co/DgtWklFxG1
0 Komentar