WhatsApp Rolls Out Cashback for UPI
Payments Through App for Select Users; Check Details
వాట్సాప్ పేమెంట్స్ ద్వారా నగదు
చెల్లింపులు చేసిన వారికి క్యాష్‌బ్యాక్ - తాజా అప్డేట్ ఇదే
కొన్ని రోజుల క్రితం వాట్సాప్
పేమెంట్స్ ద్వారా నగదు చెల్లింపులు చేసిన వారికి క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు
వార్తలు వెలువడ్డాయి. దీనిపై వాట్సాప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఈ ఆఫర్‌ని
బీటా యూజర్స్ ద్వారా పరీక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వాట్సాప్ క్యాష్‌బ్యాక్
ఆఫర్‌ను ఎంపిక చేసిన బీటా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వాట్సాప్
కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.
ఇప్పటికే పలువురు బీటా యూజర్స్
రూ. 51 క్యాష్‌బ్యాక్ పొందినట్లు స్క్రీన్ షాట్లు ట్వీట్ చేశారు. క్యాష్‌బ్యాక్‌తోపాటు
కంగ్రాచ్యులేషన్ మెసేజ్ కూడా వాట్సాప్ పంపుతున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
వాట్సాప్ పేమెంట్స్ ద్వారా ఐదుగురు యూజర్స్‌కి యూపీఐ చెల్లింపులు చేసిన యూజర్‌కి
ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ద్వారా రూ.51 వస్తాయి. అయితే బీటా
యూజర్స్‌లో ఈ క్యాష్‌బ్యాక్ ఫీచర్‌ను పరీక్షించేందుకు ఏ ప్రాతిపదికన బీటా యూజర్స్‌ని వాట్సాప్ ఎంపిక చేసిందనే
దానిపై స్పష్టతలేదు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ 2.21.22.21, ఐఓఎస్
2.21.220.14 బీటా వెర్షన్స్ ద్వారా పరీక్షించవచ్చని
వాబీటాఇన్ఫో తెలిపింది.
అలానే ఈ ఫీచర్ సాధారణ యూజర్స్‌కి
అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని టెక్ నిపుణులు
అభిప్రాయపడుతున్నారు. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా ఎక్కువ మంది యూజర్స్
చెల్లింపులు చేసేలా ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్ తీసుకొస్తుందని అంటున్నారు. పేమెంట్ సేవలను ప్రారంభించిన తొలి నాళ్లలో
గూగుల్ పే కూడా స్క్రాచ్ కార్డుల రూపంలో క్యాష్‌బ్యాక్ అందించి పెద్ద సంఖ్యలో
వినియోగదారులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పేటీఎం, ఫోన్‌పై
సైతం ఇవే మార్గాలను అనుసరించాయి. ఇటీవలే వాట్సాప్ పేమెంట్స్‌లో కొత్తగా
స్టిక్కర్స్ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని సాయంతో యూజర్స్ చెల్లింపులు చేసేప్పుడు
మెసేజ్‌కి బదులు స్టిక్కర్స్‌ని పంపొచ్చు.
వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్
పేరును మెటాగా మారుస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన
సంగతి తెలిసిందే. ఇకమీదట ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని సంస్థలకూ మెటా మాతృసంస్థగా
వ్యవహరిస్తుందని చెప్పారు. తాజాగా పలువురు వాట్సాప్ బీటా యూజర్స్ వాట్సాప్ ఫ్రమ్
ఫేస్‌బుక్‌కి బదులు వాట్సాప్ ఫ్రమ్ మెటా అనే పేరు కనిపిస్తుందని తెలిపారు. ఫేస్‌బుక్‌కి
చెందిన మిగిలిన మెసేజింగ్ యాప్‌లకు కూడా ఇదే తరహా రీబ్రాండింగ్ జరుగుతుందని
తెలుస్తోంది.
WhatsApp is rolling out cashback for UPI Payments in India!
— WABetaInfo (@WABetaInfo) October 31, 2021
If your WhatsApp account is included in their promotional campaign, you can get cashback after using WhatsApp UPI Payments on WhatsApp beta for Android and iOS!https://t.co/xiGN7DUwhO
0 Komentar