WhatsApp working on feature that lets
you hide 'last seen' status from specific people
వాట్సాప్ లాస్ట్‌సీన్‌లో ఉన్న ఆప్షన్లకు
అదనంగా కొత్తగా ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ ఆప్షన్ - వివరాలు ఇవే
మెసేజింగ్ యాప్‌లకు పోటీగా
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తోంది. ఇటీవల వరుసగా యూజర్
గోప్యతకు సంబంధించిన ఫీచర్స్‌ను ఎక్కువగా విడుదల చేస్తోంది. వీటిలో ప్రొఫైల్
ప్రైవసీ సెట్టింగ్, బ్యాకప్ డేటా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్,
పేమెంట్ వెరిఫికేషన్ వంటి ఎన్నో రకాల ఫీచర్స్ ఉన్నాయి.
తాజాగా యూజర్ ప్రైవసీకి సబంధించి
మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్
లాస్ట్‌సీన్‌లో ఉన్న ఎవ్రీవన్, మై
కాంటాక్ట్స్, నోబడీ ఆప్షన్లకు అదనంగా కొత్తగా ‘మై
కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్‌ను పరిచయం చేయనుంది.
ఇప్పటి వరకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్, ఫొటో, వీడియో, ఆడియో లేదా డాక్యుమెంట్‌లను చివరగా ఎప్పుడు
చూశామనేది ఇతరులు చూడొచ్చు. కొత్తగా తీసుకొస్తున్న మై కాంటాక్ట్ ఎక్సెప్ట్ ఆప్షన్‌తో
యూజర్ అనుమతించిన వారు మాత్రమే లాస్ట్‌సీన్‌ను చూడగలరు.
📝 WhatsApp beta for Android 2.21.23.14: what’s new?
— WABetaInfo (@WABetaInfo) November 11, 2021
WhatsApp is finally rolling out a "My Contacts Except..." option for your Privacy Settings, giving you more control over your privacy.https://t.co/1aAmNZ4Wm9
0 Komentar