APBIE: Common Question Paper for All
Colleges for Inter Half Yearly Examinations
ఇంటర్ అర్ధవార్షిక పరీక్షల్లో
అన్ని కళాశాలలకు ఉమ్మడి ప్రశ్నపత్రం
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ అర్ధ
సంవత్సరం పరీక్షలు డిసెంబరు 27 నుంచి ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులు
పరీక్షలు రాయనున్నారు. మొదటిసారిగా ఇంటర్ విద్యామండలి అర్ధవార్షిక పరీక్షల కోసం
అన్ని కళాశాలలకు ఉమ్మడి ప్రశ్నపత్రాన్ని(కామన్ పేపర్) పంపిస్తోంది. ఈ పేపర్తోనే
అన్ని కళాశాలల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ప్రశ్నపత్రాలను వెబ్ సైట్ లో
అందుబాటులో ఉంచుతారు. ప్రతి సెషను పరీక్షలు ప్రారంభమయ్యే గంటన్నర ముందు
ప్రిన్సిపల్ ఫోన్ కి పాస్వర్డ్ పంపిస్తారు. ప్రిన్సిపాళ్లు కళాశాల లాగిన్లో
పాస్వర్డ్ తో ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని, జెరాక్సులు తీసి,
విద్యార్థులకు అందించాలి. మూల్యాంకనం ఏ కళాశాలకు ఆ కళాశాలే
నిర్వహిస్తుంది. అనంతరం మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కరోనా
ఉద్ధృతి పెరిగి పరీక్షలను నిర్వహించలేకపోతే ఈ మార్కులనే ప్రామాణికంగా తీసుకునే
అవకాశం ఉందని భావిస్తున్నారు.
0 Komentar