Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CLAT 2022 Notification Released – All the Details Here

 

CLAT 2022 Notification Released – All the Details Here

క్లాట్-2022: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ – ముఖ్యమైన వివరాలు ఇవే

UPDATE 16-03-2022

CLAT (క్లాట్)-2022 పరీక్ష వాయిదా - దరఖాస్తు తుది గడువు పొడిగింపు

* దేశంలోని 20కి పైగా న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు మే 8న జరగాల్సిన కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) జూన్ 19కి వాయిదా పడింది.

* ఈ మేరకు నేషనల్ లా యూనివర్సిటీస్ కన్సార్షియం ప్రకటించింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును మే 9 వరకు పొడిగించారు.

క్లాట్ లో ర్యాంకు ఆధారంగానే హైదరాబాద్ నల్సార్, విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోనూ సీట్లను భర్తీ చేస్తారు.

NOTIFICATION ON RESCHEDULE

===================

దేశవ్యాప్తంగా ఉన్న 21 నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2022 ప్రకటన విడుదల చేసింది.

వివరాలు..

కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2022

1) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)

అర్హత: కనీసం 45% మార్కులతో ఇంటర్మీడియట్(10+2) / తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. మార్చి / ఏప్రిల్ 2022లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులే.

2) పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ)

అర్హత: కనీసం 50 % మార్కులతో ఎల్‌ఎల్‌బి డిగ్రీ/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఏప్రిల్/ మే 2022లో ఎల్‌ఎల్‌బి పూర్తి చేసిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష: ఆఫ్ లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.4000, ఎస్సీ/ ఎస్టీ/ బీపీఎల్ విద్యార్థులకు రూ.3500.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.01.2022. (దరఖాస్తు కొరకు వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి) 

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.03.2022, 09.05.2022 

క్లాట్ 2022 పరీక్ష తేది: 08.05.2022, 16.06.2022  

PAPER NOTIFICATION

CLAT-2022 WEBSITE

MAIN WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags