Conducting of Rangotsav Programme at
District Level and State Level
జిల్లా స్థాయిలో రంగోత్సవ్ పోటీలు
నిర్వహణ గురించి పత్రికా ప్రకటన తేది. 28-12-2021 (ప్రకాశం)
30-12-2021 న ఉదయం గం. 10.00 లకు రంగోత్సన్ పోటీలు ప్రారంభం
A.P SCERT డైరెక్టర్ వారి ఉత్తర్వుల
మేరకు ప్రతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ మేనేజ్ మెంట్ల పాఠశాలల లోని 1 నుండి 8 వ తరగతి చదువుచున్న విద్యార్థినీ
విద్యార్ధులకు జిల్లా స్థాయిలో రంగోత్సవ్ పోటీలు నిర్వహించవలసినదిగా
ఆదేశించియున్నారు. కనుక పైన తెలిపిన విద్యార్థినీ విద్యార్ధులకు జిల్లా విద్యా శిక్షణా
సంస్థ (డైట్) మైనంపాడు నందు తే. 30-12-2021 న ఉదయం గం. 10.00 లకు రంగోత్సన్ పోటీలు ప్రారంభించబడును. కావున జిల్లాలోని అందరు
ప్రధానోపాధ్యాయులు ఆసక్తి కలవిద్యార్థినీ విద్యార్ధులను ఈ పోటీలకు సంపవలసినదిగా
కోరడమైనది.
ఈ క్రింది అంశాలపై పోటీలు
నిర్వహించబడును.
1) కలరింగ్ కాంపిటీషన్
2) హ్యాండ్ రైటింగ్
కాంపిటీషన్
3) కార్టూన్ మేకింగ్
కాంపిటీషన్
4) గ్రీటింగ్ కార్డ్
మేకింగ్ కాంపిటీషన్
గమనించవలసిన అంశాలు:
1. పైన తెలిపిన కార్య క్రమమునకు
సంభందించిన వస్తువులు (అనగా చార్టులు/కలర్ పెన్స్ మొదలగునవి) సంబందిత విద్యార్థినీ
విద్యార్ధులో తీసుకొని రావలయును
2. COVID-19 నిబందనలను
తప్పనిసరిగా పాటించవలెను.
3. ఒక కాంపిటీషన్ లో పాల్గొన్న
విద్యార్ధి మరియొక కాంపిటీషన్ లో పాల్గొనకూడదు.
4. విద్యార్థినీ విద్యార్ధులు 1
నుండి 8 వ తరగతి లోపు చదువుతూ వుండాలి.
5. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతి ఇవ్వబడును.
6. మధ్యాహ్నం భోజనవసతి
కలదు.
7 ప్రధమ బహుమతి విజేతలను
రాష్ట్ర స్థాయికి సిఫారసు చేయబడును.
పై కార్య క్రమమునకు సంబంధించి
ఏమైనా సలహాల కొరకు నోడల్ ఆఫీసర్లు శ్రీ యం, రవీంద్ర ప్రసాద్ 9666146850 శ్రీ టి.బిక్షాలు 8885680213 నెంబర్లను
సంప్రదించగలరు మరియు https://dietmpd.blogspot.com వెబ్ సైట్
ను సందర్శించండి.
ప్రిన్సిపల్ (యఫ్.ఏ.సి),
జిల్లా విద్యా శిక్షణా సంస్థ, మైనంపాడు.
0 Komentar