How After Losing Her Younger Sister,
This Entrepreneur Started a Braintech Start-up
తన చెల్లెలిని కోల్పోయిన తర్వాత, అక్క
ఈ కారణంతో బ్రెయిన్‌టెక్ స్టార్టప్‌ను ప్రారంభించింది – వివరాలు ఇవే
బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కారణంగా తన
సోదరిని పోగొట్టుకుంది. మరొకరికి ఇలా
జరగకూడదు అన్న మానవత్వంతో ఆమె ‘న్యూఫోనీ’ అనే పరికరం కనినిపెట్టింది. రియారస్తోగీ
కనిపెట్టిన ఈ పరికరం మెదడులోని ఇన్‌ఫెక్షన్‌లను తేలిగ్గా గుర్తిస్తుంది..
రియా సోదరి పంఖూరీ 25 ఏళ్ల వయసులో ఓరోజు స్పృహతప్పి పడిపోయింది. శరీరమంతా అచేతనంగా మారింది. వైద్యులను సంప్రదిస్తే ఆమె మెదడులో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. ఆ తర్వాత ఆమె చికిత్సకు కూడా స్పందించలేదు. పూర్తిగా మంచానికే పరిమితమైన చెల్లిని చూస్తే రియాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అంతేకాదు, మధ్యమధ్యలో పంఖూరీ తీవ్రమైన నొప్పిని భరించేది. అయితే ఆ బాధను మాటల్లో చెప్పలేకపోయేది. దీనికంతా కారణం మెదడులో జరుగుతున్న మార్పులే అన్నారు వైద్యులు. వీటిని పసిగట్టలేమనేవారు. అసలు సమస్య ఏంటో తెలిస్తే దానికి చికిత్స అందించొచ్చు, కానీ మెదడులోపల ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలా అని ఆలోచించేది రియా.
అలా ఆరు నెలలకే
పంఖూరీ మృతి చెందడంతో రియా కుంగుబాటులోకి జారిపోయింది. పోస్ట్ ట్రమాటిక్
స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్‌డీ)కు గురైన ఆమె ఆసుపత్రిలో చేరింది. అక్కడే ఆమెకు
మానసికారోగ్యంపై అవగాహన పెరిగింది. ‘తను చనిపోయిన మూడేళ్లకు నా ఆలోచనకు ఓ రూపం
ఇచ్చే అవకాశం దక్కింది. 2019లో నా స్నేహితుడు భవ్య మదన్
సహకారంతో ‘న్యూఫోనీ’ అనే పరికరాన్ని తయారుచేశా. ఇది మన మెదడుకు స్మార్ట్ వాచ్
లాంటిది. బ్రెయిన్‌లో జరిగే ప్రతి చిన్న మార్పు, చర్యలను
కనిపెట్టి మనకు సమాచారాన్ని అందిస్తుంది.
ఎలక్ట్రోఎన్‌సెఫాలోగ్రఫీ(ఈఈజీ)హెడ్‌బ్యాండ్, మొబైల్ అప్లికేషన్ సాయంతో న్యూఫోనీ పరికరం పనిచేస్తుంది. దీన్ని ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఇది మెదడులో జరిగే అసాధారణ మార్పులను గుర్తిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని కోల్పోకుండా చేసి ఆరోగ్యకరమైన నిద్రను దరిచేరుస్తుంది. అంతేకాదు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ హెడ్‌బ్యాండ్‌ను ధరిస్తే మెదడులోని ఎలక్ట్రికల్ యాక్టివిటీని లెక్కించి మొబైల్ యాప్ ద్వారా మెడిటేషన్ టెక్నిక్స్‌ను సూచిస్తుంది. మెదడును సాధారణస్థాయికి తీసుకురావడానికి ఇది సాయపడుతుంది.
ఈ పరికరం కోసం ఇంజినీర్లు, టెక్ కన్సల్టెంట్స్, న్యూరోసైన్స్ మెంటార్స్
సహకారాన్ని తీసుకున్నాం. ల్యాబ్‌లోనే కాదు పలు ఆసుపత్రులలోనూ దీన్ని పరీక్షించాం.
ఒక స్టార్టప్‌ను స్థాపించి మనదేశంతోపాటు జర్మనీ, కెనడా వంటి
దేశాల్లోనూ ఈ పరికరాన్ని అందిస్తున్నాం. ప్రస్తుతం మన దేశం సహా యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, తైవాన్‌ల
నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. నా సోదరిలా మరెవరూ ఇలా అనారోగ్యంతో
చనిపోకూడదనేది నా లక్ష్యం’ అని చెబుతుంది రియా.
0 Komentar