Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ESIC Insurance Medical Officer (IMO) Recruitment: Apply for 1120 Posts – Details Here

 

ESIC Insurance Medical Officer (IMO) Recruitment: Apply for 1120 Posts – Details Here

ఈ‌ఎస్‌ఐ‌సీలో 1120 ఇన్స్యూరెన్స్ మెడికల్ ఆఫీసర్లు - అర్హత, ఎంపిక విధానం – పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకి చెందిన న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈ‌ఎస్‌ఐ‌సీ) వివిధ ఈఎస్ఎనీ హాస్పిటల్స్/ డిస్పెన్సరీల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

ఇన్స్యూరెన్స్ మెడికల్ ఆఫీసర్లు (ఐఎంఓ) గ్రేడ్ 2 (అల్లోపతిక్)

మొత్తం ఖాళీలు: 1120

అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఇంటర్న్షిప్ పూర్తి చేయని అభ్యర్థులు రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.

వయసు: 31.01.2022 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యా లు: నెలకి రూ.56100 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-1 100 మార్కులకు, సెక్షన్-2 100 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. 

సెక్షన్ 1: జనరల్ మెడిసిన్ అండ్ పీడియాట్రిక్స్ 80 + 20 ప్రశ్నలు 100 మార్కులు

సెక్షన్ 2: సర్జరీ, గైనకాలజీ అండ్ అబ్ స్టెట్రిక్స్ ప్రివెంటివ్ ఆండ్ సోషల్ మెడిసిన్ - 34 + 33 + 33 ప్రశ్నలు = 100 మార్కులు 

* ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.12.2021.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022.

NOTIFICATION

PAPER ADVT

RECRUITMENT PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags