Google Announces Its List of Best
Android Apps Of 2021 for India: Here Are All the Names
2021లో ఉత్తమ ఆండ్రాయిడ్ యాప్‌ల
జాబితాను ప్రకటించిన గూగుల్
ప్లేస్టోర్‌లో యూజర్స్‌కు మెరుగైన సేవలు అందిస్తున్న యాప్‌లను గుర్తించి వాటిలో పది యాప్‌లకు బెస్ట్ యూజర్ ఛాయిస్ పేరుతో గూగుల్ (Google)ఓటింగ్ నిర్వహిస్తుంది. వాటిలో అధిక ఓటింగ్ వచ్చిన యాప్‌ను విజేతగా ప్రకటిస్తుంది. మరి 2021 యూజర్ ఛాయిస్ యాప్ (2021 User Choice App) అవార్డు గెలుచుకున్న యాప్‌లు ఏవో చూద్దాం.
యూజర్ ఛాయిస్ యాప్
1. క్లబ్‌హౌస్ (Clubhouse)
గూగుల్ ప్లేస్టోర్ 2021 యూజర్ ఛాయిస్ యాప్‌గా
క్లబ్‌హౌస్ (Clubhouse) ఎంపికయింది. ఈ ఏడాది ప్రథమార్థంలో
క్లబ్‌హౌస్ భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇది ఆడియో
సోషల్ మీడియా యాప్. ఇందులో మీకు పరిచయం ఉన్నవారు, స్నేహితులతోపాటు
కొత్త వారితో పరిచయం పెంచుకొని.. వాళ్లతో మీకు నచ్చిన అంశాలపై మాట్లాడటంతోపాటు మీ
ఆలోచనలను పంచుకోవచ్చు. అంతేకాకుండా క్లబ్‌హౌస్‌లో వన్-టు-వన్ చాట్, గ్రూప్ చాట్ వంటి ఫీచర్లున్నాయి. గతంలో ఈ యాప్‌ను ఉపయోగించాలంటే ఇతరులు
మనల్ని ఇన్వైట్ చేయాలి. కొద్దిరోజుల క్రితం ఇన్వైట్ రిక్వెస్ట్ ఫీచర్‌ను
తొలగించినట్లు క్లబ్‌హౌస్ వెల్లడించింది. దీంతో ఎవరైనా సైనప్ చేసి యాప్‌ను
ఉపయోగించవచ్చు.
యూజర్ ఛాయిస్ గేమ్
2. గరేనా ఫ్రీ ఫైర్ మాక్స్ (Garena Free Fire Max).
2021 యూజర్ ఛాయిస్ గేమ్ విజేత గరేనా ఫ్రీ ఫైర్ మాక్స్ (Garena Free Fire Max). ప్రత్యర్థులను ఎదిరించి నిలవటమే ఈ గేమ్ లక్ష్యం. వేర్వేరు ప్రదేశాల్లో మనకి నచ్చిన ఆయుధాలను సేకరిస్తూ.. ప్రత్యర్థులను అంతమొందిస్తూ.. లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ గేమ్ ఫైర్‌లింక్ టెక్నాలజీ సాయంతో యూజర్‌కు బ్యాటిల్ రాయల్ గేమ్ అనుభూతిని కలిగిస్తుంది. ఈ గేమ్‌లో నలుగురు ఆటగాళ్లు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి చాట్ చేసుకునే సదుపాయం ఉంది. అలానే హెచ్‌డీ గ్రాఫిక్స్ ఉన్నాయి.
DOWNLOAD
Garena Free Fire MAX APP
=========================================
వీటితోపాటు యూజర్స్ అవసరాలకు
తగినట్లుగా ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో మునుపెన్నడూ లేని విధంగా మెరుగైన సేవలను
అందిస్తున్న యాప్స్‌ను గుర్తించి వాటిలో కొన్నింటిని గూగుల్ బెస్ట్ యాప్స్ (Best Apps of
2021)గా ప్రకటించింది. భారత్‌లో ఈ ఏడాది ఎక్కువగా ఈ-లెర్నింగ్ యాప్‌లను
ఉపయోగించినట్లు గూగుల్ పేర్కొంది. ఆన్‌లైన్ ద్వారా నైపుణ్యాలను పెంచుకుంనేదుకు
అనువైన యాప్‌లను భారతీయులు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపింది. వాటిలోంచి
ఒకదాన్ని బెస్ట్ యాప్‌గా ప్రకటించింది. అవేంటో చూసేయండి మరి.
బెస్ట్ యాప్ ఆఫ్ 2021
3. బిట్‌క్లాస్ (Bitclass: Learn Anything Live together)
ఈ ఏడాది బెస్ట్ యాప్ ఆఫ్ 2021గా బిట్‌క్లాస్ (Bitclass: Learn Anything Live together) నిలిచింది. బెంగళూరుకు చెందిన టెకీలు దీన్ని రూపొందించారు. స్థానిక
పరిస్థితులకు అనుగుణంగా భారత్‌లో డిజిటల్ లెర్నింగ్‌కు కొత్త ఆవిష్కరణలతో ఈ యాప్
పరిష్కారం చూపుతోందని గూగుల్ వ్యాఖ్యానించింది. ఇందులో అన్ని రంగాలకు సంబంధించి
ఉచిత ఆన్‌లైన్ బోధన తరగతులు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ద్వారా భారతీయ
విద్యార్థులతోపాటు వివిధ దేశాల్లోని విద్యార్థులతో సంభాషించవచ్చు. అనుభవం కలిగిన
బోధనా సిబ్బంది విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనను అందిస్తారు. అలానే క్లాసులు
పూర్తయిన తర్వాత 24x7 గ్రూప్ చాట్ చేసుకునే సదుపాయం ఈ యాప్‌లో
ఉంది.
బెస్ట్ గేమ్ ఆఫ్ 2021
2021 బెస్ట్ గేమ్ యాప్
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (Battlegrounds Mobile India). భారత్‌లో పబ్‌జీ (PUBG) నిషేధం తర్వాత క్రాఫ్టన్
సంస్థ ఈ గేమ్ పేరును బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ)గా మార్పు
చేసింది. ఈ వార్ ఫేర్ గేమ్‌కు గతంలో కంటే ఎక్కువ ఆదరణ లభించడం విశేషం. ఇందులోని
మిర్రర్ వరల్డ్ అద్భుతమైన గేమింగ్ అనుభూతి అందిస్తుంది. ఈ గేమ్ పూర్తిగా పబ్‌జీ
తరహాలోనే ఉన్నప్పటికీ ఆట పరంగా ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి.
DOWNLOAD
Battlegrounds Mobile India APP
ఇవే కాకుండా వివిధ కేటగిరీల్లో ఎంపిక
చేసిన యాప్ ల వివరాలు ఇవే
యాప్ ఫర్ గుడ్ (App for Good) కేటగిరీలో
5. ఎవర్‌గ్రీన్ క్లబ్ (Evergreen Club -
Health, Fitness, Fun & Learning),
6. బీయింగ్ (being:
your mental health friend),
7. స్పీచిఫై (Speechify
- text to speech tts) లు ఎంపికయ్యాయి.
వ్యక్తిగత వృద్ధి (Personal Growth)
విభాగంలో
8. బిట్‌క్లాస్ (Bitclass:
Learn Anything. Live. Together),
9. ఎంబైబీ (EMBIBE:
Learning Outcomes App),
10. ఎవాల్వ్ మెంటల్ హెల్త్
(Evolve Mental Health: Meditations, Self-Care & CBT)లు
ఉన్నాయి.
Download
Evolve Mental Health APP
రోజువారీ అవసరాలు (Everyday
Essentials) కేటగిరీలో
11. సోర్ట్జీ (Sortizy
- Recipes, Meal Planner & Grocery Lists),
12. సార్వా (SARVA -
Yoga & Meditation),
13. గార్డియన్స్ ఫ్రమ్
ట్రూకాలర్ (Guardians from Truecaller) యాప్స్‌ను గూగుల్
ఎంపిక చేసింది.
0 Komentar