ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు
◼◼◼◼◼◼◼◼◼◼
1. ❓ప్రశ్న:
నేను, నా
భర్త టీచర్లం. నా భర్త మరణించిన పిదప నాకు కుటుంబ పెన్షన్ ఇస్తున్నారు. దీనికి DA
ఇవ్వరా?
✅జవాబు:
జీఓ.51, తేదీ:30.4.15 ప్రకారం కారుణ్య నియామకం పొందిన వారికి
మాత్రమే DA ఇవ్వరు. మీకు కుటుంబ పెన్షన్ పై DA చెల్లిస్తారు.
◼◼◼◼◼◼◼◼◼◼
2. ❓ప్రశ్న:
నేను డ్రాయింగ్ టీచర్ ని. PAT పాస్ అయ్యాను. B. Com పాస్ అయ్యాను. B. ed లేదు. నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా?
✅జవాబు:
24 ఇయర్స్ స్కేల్ పొందాలి
అంటే డిగ్రీ & బీ.ఎడ్ ఉండాలి.
◼◼◼◼◼◼◼◼◼◼
3. ❓ప్రశ్న:
నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను. అలవెన్సు ఇచ్చారు. పెరిగిన DA తేడా
ఇవ్వరా?
✅జవాబు:
FAC కాలానికి, సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.
◼◼◼◼◼◼◼◼◼◼
4. ❓ప్రశ్న:
ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు.
ఇంక్రిమెంట్ ఆపారు. అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు ఈ
కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా?
✅జవాబు:
మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల
కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.
◼◼◼◼◼◼◼◼◼◼
5. ❓ప్రశ్న:
నేను శనివారం, సోమవారం
సెలవు పెట్టాలి. రెండు CL లెటర్లు ఇవ్వాలా?
✅జవాబు:
అవసరం లేదు. ఒక లెటర్ పై రాసి
ఆదివారం అనుమతి అని రాయండి సరిపోతుంది.
0 Komentar