ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు –
సమాధానాలు
◼◼◼◼◼◼◼◼◼◼
1. ❓ప్రశ్న:
e-ఫైలింగ్ ఎపుడు చేయవచ్చు?
✅జవాబు:
మన DDO లు సంబందిత
ఫైనాన్షియల్ ఇయర్ TDS చేసి వుంటే మన e ఫైలింగ్
చేయవచ్చు.
◼◼◼◼◼◼◼◼◼◼
2. ❓ప్రశ్న:
నేను ఇది వరకే టాక్స్ చెల్లించా, నాకు కట్టిన టాక్స్ రిటర్న్ వస్తుందా?
✅జవాబు:
ఖచ్చితంగా మీరు అదనంగా కట్టిన
టాక్స్ మీ బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది.
◼◼◼◼◼◼◼◼◼◼
3. ❓ప్రశ్న:
నేను ఒక cps ఉద్యోగిని ఏ సందర్భంలో 50వేల రూపాయలు టాక్స్
ఎక్జంప్సన్ క్లైం చేసుకోవచ్చు.?
✅జవాబు:
మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది (eఫైలింగ్
చేస్తే).లేదంటే వర్తించదు.
◼◼◼◼◼◼◼◼◼◼
4. ❓ప్రశ్న:
SGTలలో 50 సం.లు దాటినవారు 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?
✅జవాబు:
కారు. వారు G.O.Ms.No.93,
Dt.03.04.2010 ప్రకారం సదరు ఉపాధ్యాయులు అందుకు సంబంధించిన
విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.
Sir,
ReplyDeleteOka employee promotion meeda vere Station vellinappudu athani service register eanni rojullo pampali....?