Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL Retention: Full List of Big Names Released by All Franchises Ahead of IPL Mega Auction

 

IPL Retention: Full List of Big Names Released by All Franchises Ahead of IPL Mega Auction

ఐపీఎల్: ఎనిమిది ఫ్రాంచైజీలు రిటెయిన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే!

ఐపీఎల్‌లో పాత ఫ్రాంచైజీల ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసింది. బీసీసీఐ విధించిన గడువు (నవంబర్ 30) ముగియడంతో ఎనిమిది ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి. ఆ వివరాలను తాజాగా బోర్డు వెల్లడించింది. చెన్నై, దిల్లీ, కోల్‌కతా నలుగురేసి.. బెంగళూరు, హైదరాబాద్‌, రాజస్థాన్‌ ముగ్గురేసి ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్‌ చేసుకుంది.

ఈ జాబితా ప్రకారం..

1. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: రిటెన్షన్‌ ఆటగాళ్లు: మాక్స్‌వెల్ (₹11కోట్లు), విరాట్ కోహ్లీ (₹15 కోట్లు), మహ్మద్ సిరాజ్‌ (₹7 కోట్లు). కొత్త ఆటగాళ్ల వేలం కోసం: ₹57 కోట్లు.

2. ముంబయి ఇండియన్స్‌: రిటెన్షన్‌ ఆటగాళ్లు: రోహిత్ శర్మ (₹16 కోట్లు), బుమ్రా (₹12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (₹8 కోట్లు), పొలార్డ్‌ (6 కోట్లు). కొత్త ఆటగాళ్ల కోసం: ₹48 కోట్లు.

3. పంజాబ్ కింగ్స్‌: రిటెన్షన్‌ ఆటగాళ్లు: మయాంక్‌ అగర్వాల్ (₹12 కోట్లు), అర్ష్‌దీప్‌ సింగ్ (₹4 కోట్లు). వేలం కోసం: ₹72 కోట్లు

4. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:  రిటెన్షన్‌ ఆటగాళ్లు: విలియమ్సన్‌ (₹14 కోట్లు), అబ్దుల్ సమద్‌ (₹4 కోట్లు), ఉమ్రాన్‌ మాలిక్‌ (₹4 కోట్లు). కొత్త ఆటగాళ్ల వేలం కోసం: ₹68 కోట్లు

5. చెన్నై సూపర్‌ కింగ్స్‌: రిటైన్‌ ఆటగాళ్లు: ధోని (₹12 కోట్లు), రవీంద్ర జడేజా (₹16 కోట్లు), మొయిన్‌ అలీ (₹8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (₹6 కోట్లు). వేలం కోసం: ₹48 కోట్లు

6. దిల్లీ క్యాపిటల్స్‌: రిటెన్షన్‌ ఆటగాళ్లు: రిషబ్‌ పంత్‌ (₹16 కోట్లు), అక్షర్ పటేల్‌ (9 కోట్లు), పృథ్వీ షా (₹7.50 కోట్లు), నార్జే (₹6.50 కోట్లు). వేలం కోసం: 47.5 కోట్లు

7. కోల్‌కతా నైట్‌రైడర్స్‌: రిటెన్షన్‌ ఆటగాళ్లు: రస్సేల్‌ (₹12 కోట్లు) వరుణ్‌ చక్రవర్తి (₹8 కోట్లు), వెంకటేష్ అయ్యర్‌ (₹8 కోట్లు), సునీల్ నరైన్‌ (6 కోట్లు). వేలం కోసం: 48 కోట్లు

8. రాజస్థాన్ రాయల్స్‌: కొత్త ఆటగాళ్ల కోసం: ₹62 కోట్లు. రిటెన్షన్‌ ఆటగాళ్లు సంజూ శాంసన్‌ (₹14 కోట్లు), జోస్‌ బట్లర్‌ (₹10 కోట్లు), యశస్వి జైశ్వాల్‌ (₹ 4కోట్లు)లకు రిటైన్ చేసుకుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags