Low-Cost Vitamin-D Diagnostic Test -
Developed by OU Professor
తక్కువ సమయంలో, స్వల్ప
ఖర్చుతో విటమిన్-డి నిర్ధారణ పరీక్ష - అభివృద్ధి చేసిన ఓయూ ప్రొఫెసర్
స్వల్ప ఖర్చుతోనే, తక్కువ
సమయంలో విటమిన్-డి స్థాయులు గుర్తించే సరికొత్త విధానాన్ని (ర్యాపిడ్ సెన్సిటివ్
అడ్వాన్స్‌డ్ మాస్ స్పెక్టోమెట్రి మెథడ్ ఫర్ ఎవాల్యుయేషన్) ఉస్మానియా
విశ్వవిద్యాలయ ఆచార్యులు కనుగొన్నారు. రసాయన శాస్త్ర ఆచార్యుడు డా.పి.మురళీధర్‌రెడ్డి
నేతృత్వంలో దీన్ని రూపొందించారు. దీనికి తైవాన్‌కు చెందిన సుచీ మెడికల్
యూనివర్సిటీ ఆచార్యుడు ప్రొ.అన్‌రెన్ హు సహకారం అందించారు.
విటమిన్-డి లోపంతో ఎముకల సంబంధిత
వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కొవిడ్ సోకి ఐసీయూ దశకు చేరిన రోగుల్లో విటమిన్-డి
తక్కువ ఉన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం దీని స్థాయులను
గుర్తించేందుకు ‘కెమిల్యూమ్నిసెంట్ ఇమ్యునో అస్సె’ పరీక్ష అందుబాటులో ఉంది.
దీనికి ప్రైవేటు ప్రయోగశాలల్లో రూ.500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు.
ఫలితాలు వచ్చేందుకు 35 నిమిషాలకుపైగా పడుతుంది. కొత్త విధానంలో 9 నిమిషాల్లోనే
ఫలితం రాబట్టవచ్చు. కేవలం రూ.50 ఖర్చు అవుతుంది.
ప్రయోగాత్మకంగా నిరూపితమైన ఈ విధానం ప్రజలకు అందుబాటులోకి రావడానికి
మరికొంతకాలం పట్టనుంది.
0 Komentar