NBT Announces Of 75 Selected Authors
Under PM- YUVA Mentorship Scheme
పీఎం యువ మెంటార్షిప్ పథకానికి 75
మంది ఎంపిక - తెలుగు నుంచి ముగ్గురు రచయితలు
స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో
భాగంగా నిర్వహిస్తున్న పీఎం-యువ మెంటార్షిప్ పథకానికి దేశవ్యాప్తంగా 75
మంది రచయితలు ఎంపికయ్యారు. 'భారత జాతీయోద్యమం' నేపథ్యంగా జరిగిన పోటీకి వచ్చిన రచనల ఆధారంగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్
ఇండియా ఆధ్వర్యంలో వీరిని ఎంపిక చేశారు, పోటీ ఫలితాలను
శనివారం ప్రకటించారు.
ఈ పోటీ ద్వారా 30 ఏళ్ల కంటే తక్కువ
వయస్సు ఉన్న 75 మంది యువ రచయితలను ఎంపిక చేశారు. ఇందులో తెలుగు భాష నుంచి బోనగిరి
సుకన్య,
దేవరకొండ ప్రవీణ్ కుమార్, కమ్మరి జ్ఞానేశ్వర్
అనే ముగ్గురిని ఎంపిక చేశారు. ఎంపికైన 75 మంది రచయితల్లో 38 మంది పురుషులు,
37 మంది మహిళలు ఉన్నారు. ఈ పోటీల కోసం ఇంగ్లిష్ తో పాటు దేశం లోని 22 అధికారిక భాషల నుంచి 16 వేల ఎంట్రీలు వచ్చాయి.
ఈ పుస్తక ప్రతిపాదనలను మూడు దశల్లో
వడపోసి 75
రచనలు ఎంపిక చేశారు. ఎంపికైన ప్రతి పాదనలు పూర్తిస్థాయి పుస్తకాలుగా
వెలువడేందుకు వీలుగా ఆయా రచయితలను ఆరు నెలలపాటు నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా సంపాదక బృందం, ప్రముఖ రచయితల
మార్గదర్శకత్వంలో ఉంచుతారు. అనంతరం ఆ పుస్తకాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో
ప్రచురించడంతో పాటు ఇతర భారతీయ భాషల్లోకి అనువదిస్తారు. ఈ ఆరు నెలల కాలానికి ఒక్కో
రచయితకు నెలకు రూ.50 వేల ఉపకార వేతనంతో పాటు పుస్తకాలు
ప్రచురితమైన తర్వాత వాటిపై వచ్చే ఆదాయంలో పది శాతం రాయల్టీగా ఇస్తారు.
CLICK
FOR LIST OF SELECTED AUTHORS
75 authors were selected through a contest conducted by NBT for a Scholarship-cum-Mentorship Scheme for young authors, below the age of 30 years@PMOIndia #Assam @himantabiswa #PMOIndia @nbt_india @NBirenSingh https://t.co/KIWkjWRXd9
— NorthEast Now (@NENowNews) December 25, 2021
0 Komentar