Indian Govt Warns Parents About Online
Gaming Addiction in Children – Details Here
ఆన్‌లైన్ గేముల గురించి తల్లిదండ్రులకి
సూచనలు జారీ చేసిన కేంద్ర విద్యాశాఖ
ఆన్‌లైన్ ఆటలు, వాటిలో
చేసే కొనుగోళ్లు పిల్లలు, తల్లిదండ్రులపై తీవ్ర ప్రతికూల
ప్రభావం చూపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆన్‌లైన్ గేముల్లో
కొనుగోళ్లు చేపట్టేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేసింది. సబ్‌స్క్రిప్షన్ల
కోసం ఆయా యాప్‌లలో క్రెడిట్/డెబిట్ కార్డులను రిజిస్టర్ చేసుకోవడాన్ని
నిషేధించింది.
ఆన్‌లైన్ గేమ్‌లకు సంబంధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కేంద్ర విద్యాశాఖ తాజాగా ఈ మేరకు సూచనలు జారీ చేసింది. విరామం లేకుండా ఎక్కువసేపు ఈ ఆటలు ఆడటం వల్ల ప్రధానంగా పాఠశాల విద్యార్థులు ‘గేమింగ్ రుగ్మత’ బారిన పడుతున్నారని అందులో పేర్కొంది. అలాంటివారిలో మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలిపింది. కొన్ని గేమింగ్ కంపెనీలు చిన్నారుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయని.. ఆటల్లో తదుపరి లెవల్స్‌ని కొనుగోలు చేసేలా, ఇన్-యాప్ కొనుగోళ్లు చేపట్టేలా వారిని బలవంతం చేస్తున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో ‘పిల్లల సురక్షిత ఆన్‌లైన్ గేమింగ్’ కోసం ఏం చేయాలో, ఏం చేయకూడదో స్పష్టంగా తెలియజేసింది.
ఏం చేయాలంటే..
> ధ్రువీకృతంకాని వెబ్‌సైట్‌ల
నుంచి సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేయకుండా పిల్లల్లో అవగాహన కల్పించాలి.
> వెబ్‌సైట్‌లలో వచ్చే
లింక్‌లు, చిత్రాలు, పాప్‌అప్‌లపై
క్లిక్ చేస్తే ఎదురయ్యే అనర్థాలను వారికి వివరించాలి.
> గోప్యతను
కాపాడుకునేందుకు ఆటల్లో ‘స్క్రీన్ నేమ్ (అవతార్)’ను మాత్రమే ఉపయోగించేలా
ప్రోత్సహించాలి.
> ఓటీపీ ఆధారిత
చెల్లింపుల ద్వారానే కొనుగోళ్లు చేయాలి.
> లావాదేవీలకు గరిష్ఠ
పరిమితి విధించాలి.
> ఆన్‌లైన్ గేమ్‌లు
ఆడుతున్నప్పుడు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే.. వెంటనే స్క్రీన్‌షాట్
తీసుకోవాలి. ఆటను ఆపేసి, సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు
చేయాలి.
> చిన్నారులు ఉపయోగించే కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు వీలుగా ఇళ్లలో ఇంటర్నెట్ గేట్‌వేను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఏం చేయకూడదంటే..
> తల్లిదండ్రుల అనుమతి
లేకుండా ఇన్-గేమ్ కొనుగోళ్లు చేపట్టకూడదు.
> సబ్‌స్క్రిప్షన్ల కోసం
యాప్‌లలో క్రెడిట్/డెబిట్ కార్డుల రిజిస్ట్రేషన్ చేయకూడదు.
> ఆన్‌లైన్ గేమింగ్
కోసం ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, మొబైళ్ల నుంచి పిల్లలు
నేరుగా కొనుగోళ్లు చేపట్టకుండా నిరోధించాలి.
A detailed advisory to parents & teachers has been issued with respect to online gaming, highlighting various do’s and don’ts.
— Ministry of Education (@EduMinOfIndia) December 10, 2021
To know more, click https://t.co/og2RGUxpo7
0 Komentar