PRC Report: 11th PRC Report Highlights Here - Check the PRC Report Also
పీఆర్సీ నివేదిక: 11 వ పీఆర్‌సీ నివేదిక ముఖ్యాంశాలు ఇవే - పీఆర్‌సీ నివేదిక ఇదే
11వ పి.ఆర్.సి. నివేదిక –
ముఖ్యాంశాలు
(Prepared by T Kameshwara Rao Sir) 👇
G.O.MS.No. 75 Dated: 28-05-2018 👇
FIXATION TABLE 👇
==========================
సిఫార్సుల్లో కొన్ని ముఖ్యాంశాలు
🔮మూలవేతనం 32 గ్రేడులు,
83 స్టేజిలు. కనీస వేతనం రూ.20,000, గరిష్ఠ
వేతనం రూ.1,79,000.
🔮11వ వేతన సవరణ కమిషన్ 23% ఫిట్‌మెంట్ లెక్కల ప్రకారం ఖరారు చేసింది. ఇప్పటికే 27% మధ్యంతర భృతి ఇస్తున్నందున అదే మొత్తానికి (27%) సిఫార్సు
చేసింది. ప్రస్తుతం సీఎస్ కమిటీ ఏడో కేంద్ర వేతన సవరణ సిఫార్సుల ప్రకారం 14.29% ఫిట్‌మెంట్ ఇస్తే చాలని పేర్కొంది.
🔮ఇంటి అద్దె భత్యాన్ని పీఆర్‌సీ కమిటీ 12% నుంచి 30% వరకు వివిధ కేటగిరీల్లో సిఫార్సు చేసే
సీఎస్ కమిటీ అంత అవసరం లేదంది. 8% నుంచి 24% వరకు వివిధ నగరాలకు, పట్టణాల్లో ఉద్యోగులకు సిఫార్సు
చేసింది.
🔮అదనపు విద్యార్హతలకు అదనపు భత్యం
ఇవ్వాల్సిన అవసరం లేదు.
🔮బోధనేతర విద్యా సిబ్బందికి 5
రోజుల అదనపు సీఎల్‌కు సిఫార్సు.
🔮పిల్లల సంరక్షణకు మూడు దశల్లో 180 రోజుల సెలవుకు అనుమతి. ఒంటరి పురుషులకు కూడా ఈ సెలవు వర్తింపజేయనున్నారు.
🔮ప్రతి ఏటా ఆరోగ్య చికిత్సలు పెన్షనర్లకు
వారి జీవిత భాగస్వాములకు వర్తింపు.
🔮సర్వీసు పెన్షనర్లకు, కుటుంబ
పెన్షనర్లకు నెలకు రూ.500 ఆరోగ్య భత్యం చెల్లింపు.
🔮అంత్యక్రియలకు సాయం రూ.20
వేలకు పెంపు.
🔮ట్యూషన్ ఫీజు నెలకు రూ.2,500 వరకు తిరిగి చెల్లింపు. గరిష్ఠంగా ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ఇది
వర్తింపు.
🔮ఇంతకుముందు 70
ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఇచ్చే వారు. ఇప్పుడది 80 ఏళ్ల నుంచి వర్తింపజేయాలని సీఎస్ కమిటీ సిఫార్సు.
🔮అదనపు పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ
శ్లాబులను పరిగణనలోకి తీసుకున్నందున 70 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వయసు పెన్షనర్లకు మొత్తం పెన్షన్ (గ్రాస్ పెన్షన్) తగ్గే ప్రమాదం
ఉండొచ్చు. అందువల్ల ఇప్పుడు పొందుతున్న మొత్తం పెన్షన్‌కు రక్షణ కల్పించాలి. ఆ
తగ్గే మొత్తాన్ని పర్సనల్ పెన్షన్‌గా ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫార్సు చేసింది.
🔮కాంట్రాక్టు ఉద్యోగులకు, ఎన్‌ఎంఆర్
ఉద్యోగులకు, కాంటింజెంట్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.20,000తోపాటు కరవు భత్యం కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
🔮హోం గార్డుల కోసం 11వ
వేతన సవరణ కమిటీ సిఫార్సులను సీఎస్ కమిటీ తిరస్కరించింది. హోంగార్డులకు వేతనం
నిర్ధారించే అంశం వేతన సవరణ కమిటీ పరిధిలో లేదంది. ఇప్పటికే వారికి గత రెండు
మూడేళ్లలో 77.5% రోజు వారీ విధి భత్యం పెంచినందున ఇక వారికి
ఎలాంటి పెంపు అవసరం లేదని సీఎస్ కమిటీ పేర్కొంది.
🔮ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచుతూ సిఫార్సు
చేసింది.
================================
పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌పై కార్యదర్శుల కమిటీ రూపొందించిన నివేదికను సీఎస్ సమీర్ శర్మ, కమిటీ సభ్యులు కలిసి తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు అందించారు. నివేదికను సీఎం జగన్ పరిశీలించిన అనంతరం సచివాలయంలో సీఎస్ మీడియాతో మాట్లాడుతూ పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌పై వివరాలు వెల్లడించారు.
‘‘ఫిట్‌మెంట్‌పై సీఎం జగన్‌కు 11 ప్రతిపాదనలు ఇచ్చాం. పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించాం. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 7 రకాల సిఫార్సులు చేశాం. నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలి.. 5 అంశాలను మార్పులతో అమలు చేయాలి.. 2 అంశాలను అమలు చేయక్కర్లేదు... ఇలా ప్రతిపాదనలు సూచించాం. 11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 23శాతం ఫిటమెంట్, 11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 27 శాతం ఫిటమెంట్, 11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 14 శాతం ఫిటమెంట్, 11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 30 శాతం ఫిటమెంట్.. ఇలా 7 రకాల ప్రతిపాదనలు రూపొందించి సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఈ ఏడింటిలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు’’ .
‘‘రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8 వేల కోట్ల
నుంచి రూ.10 వేల కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. ఒప్పంద,
పొరుగుసేవల సిబ్బంది, సచివాలయ ఉద్యోగులకూ ఫిట్‌మెంట్
సిఫార్సు చేశాం. అధికారులు, నిపుణులతో చర్చించాక ఫిట్‌మెంట్
ఎంత ఇవ్వాలన్న దానిపై సీఎం జగన్ 3 రోజుల్లోగా నిర్ణయం
తీసుకొని ప్రకటిస్తారు. పెండింగ్ డీఏలపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం
తీసుకుంటాం’’ అని సీఎస్ వివరించారు.
‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విభజన పెను ప్రభావం చూపింది. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ. 1,70,215గా ఉంది. రూ. 6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ఉన్న రూ. 18,969.26 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. రూ.20 వేల కోట్ల అదనపు భారం పడింది. ఇంతటి కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. జులై 1, 2019 నుంచి 27 శాతం ఐఆర్‌ను ఇచ్చింది. ఐఆర్ రూపంలో ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ.4,569.78 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులతో కలిపి మొత్తంగా 3,01,021 మంది ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లుకు పెరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ విభాగాలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు తదితర ఉద్యోగులకూ వర్తింపజేసింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా వీరికి అమలు చేస్తోంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 360 కోట్ల మేర ఏడాదికి అదనపు భారం పడుతోంది’’ అని సీఎస్ తెలిపారు.
CLICK HERE FOR PRC REPORT (TELUGU)
===================================
0 Komentar