RBI’s New Rules on Credit-Debit Card
Transactions To be Effective from Jan 1: Things to Know
జనవరి 1 నుంచి
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్
- ఆన్‌లైన్ కొనుగోళ్లకు కార్డుపై నంబర్లన్నీ ప్రతిసారీ ఎంటర్
చేయాల్సిందేనా?
ఇ-కామర్స్ పోర్టళ్లలో గానీ.. ఫుడ్
డెలివరీ యాప్స్‌లో గానీ ఇప్పటి వరకు మనం ఒకసారి కార్డు వివరాలు ఎంటర్ చేస్తే
మళ్లీ మళ్లీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఇకపై అలా కుదరదు. జనవరి 1
నుంచి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏదైనా లావాదేవీ జరపాలంటే మీ
క్రెడిట్/డెబిట్ కార్డుపై ఉన్న వివరాలన్నీ ఎంటర్ చేయాల్సిందే. అలాకాకుండా
మునుపటిలా సులువుగా మీ లావాదేవీ పూర్తి చేయాలంటే మీ కార్డును టోకనైజ్ చేయాలి.
ఇంతకీ ఏంటీ టోకనైజేషన్? ఎలా చేయాలి?
ఇ-కామర్స్ వేదికల్లో ఒకసారి మనం
కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే భవిష్యత్ కొనుగోళ్ల కోసం ఆ కార్డు వివరాలను
సదరు ఇ-కామర్స్ వేదికలు సేవ్ చేసుకునేవి. అయితే, వినియోగదారుల
భద్రత కోసం ఆర్‌బీఐ నిబంధనలను మార్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త
మార్గదర్శకాలను ప్రకటించింది. అంటే ఆయా వేదికలేవీ ఇకపై కార్డు వివరాలను
భద్రపరచకూడదు. కేవలం వినియోగదారుడు టోకనైజేషన్‌కు అనుమతిస్తేనే సేవ్ చేయాలి. ఆ
వివరాలు ప్రత్యేకమైన ఆల్గారిథమ్‌తో రూపొందించిన కోడ్ రూపంలో నిక్షిప్తమవుతాయి.
ఇలా టోకనైజ్ చేయడం వల్ల భవిష్యత్ కొనుగోళ్ల సమయంలో కార్డులోని చివరి నాలుగు
అంకెలు వినియోగదారుడికి మాత్రమే కనిపిస్తాయి.
ఇప్పటికే కొన్ని కంపెనీలు
టోకనైజేషన్ కోసం ‘సేవ్ కార్డు యాజ్ పర్ ఆర్‌బీఐ న్యూ గైడ్‌లైన్స్’ అనే ఆప్షన్‌ను
వినియోగదారుల ముందుంచుతున్నాయి. ఒకవేళ ఆ ఆప్షన్ ఎంచుకోకపోతే మీ వివరాలు ఇకపై ఆ యాప్‌లోగానీ, పోర్టల్‌లో
గానీ కనిపించవు. ఇది కేవలం దేశీయ లావాదేవీలకు మాత్రమే.. అంతర్జాతీయ లావాదేవీలకు ఈ
నిబంధన వర్తించదు. టోకనైజ్‌కు ఎలాంటి అదనపు రుసుములూ చెల్లించాల్సిన అవసరం లేదు.
టోకనైజేషన్ అంటే ?
వినియోగదారుల డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఆర్బీఐ టోకనైజేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ట్రాన్సాక్షన్ జరిపే సమయంలో కార్డ్ వివరాలు సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా సెక్యూర్ గా ఉంచే వ్యవస్థనే టోకెన్ అంటారు. ట్రాన్సాక్షన్ చేసే సమయంలో వినియోగదారుడు 16 అంకెల కార్డ్ నెంబర్‌ను ఎంట్రి చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ తెచ్చిన టోకనైజేషన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి వ్యక్తిగత, కార్డ్ వివరాలు, సీవీవీ నెంబర్‌లను ఎంట్రీ చేసే అవకాశం లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు.
టోకనైజేషన్ కార్డ్ ఎలా పొందాలి?
►ఆన్
లైన్ ట్రాన్సాక్షన్‌లు నిర్వహించే సమయంలో మీ కార్డ్ వివరాలు ఎంటర్
చేసినప్పుడు..ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్‌వర్క్
కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్ పంపిస్తాయి.
►ఇవి
కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను
జనరేట్ చేస్తాయి.
► ఇవి
కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి.
►తర్వాత ఎప్పుడైనా
లావాదేవీలు నిర్వహిస్తే.. కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్
చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది.
0 Komentar