SBI Card Launches 'Sbi Card PULSE' – Welcome
Gift and Health Benefits – Details Here
‘ఎస్‌బీఐ కార్డ్ పల్స్’ పేరుతో ఎస్‌బిఐ
నుండి కొత్త క్రెడిట్ కార్డు - వెల్‌కమ్ గిఫ్ట్‌గా స్మార్ట్ వాచ్ - వివరాలు ఇవే
ఎస్‌బీఐ తమ క్రెడిట్ కార్డుల జాబితాలో మరో కొత్త కార్డును జత చేసింది. ఫిట్‌నెస్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ‘ఎస్‌బీఐ కార్డ్ పల్స్’ పేరుతో క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఫిట్‌నెస్, ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలను అందిస్తున్న మొట్ట మొదటి క్రెడిట్ కార్డ్ ఇదే కావడం విశేషం.
వీసా సిగ్నేచర్ ప్లాట్‌ఫాంలో ఈ ఫిట్‌నెస్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది ఎస్‌బీఐ. ఈ కాంటాక్ట్‌లెస్ కార్డ్ వార్షిక సభ్యత్వ రుసుము రూ.1,499. ఈ కార్డుపై ఏడాది లోపు రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రెన్యువల్ ఫీజును రద్దు చేస్తారు. ఈ కార్డు తీసుకున్నవారికి ప్రవేశ రుసుము చెల్లింపుపై వెల్‌కమ్ గిఫ్ట్ కింద రూ.4,999 విలువైన నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్‌ను ఎస్‌బీఐ ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.40 అంగుళాల ఫుల్ కలర్ డిస్‌ప్లేతో వస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ (ఎస్‌పీఓ2), స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఎస్‌బీఐ కార్డ్ పల్స్ ఫీచర్లు..
* వెల్‌కమ్ బెనిఫిట్ కింద
రూ.4999 విలువ చేసే నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్.
* ఫిట్‌పాస్ ప్రోలో ఒక సంవత్సరం
కాంప్లిమెంటరీ సభ్యత్వం. ఫిట్‌పాస్ సభ్యత్వం తీసుకున్న వారికి 4,000కు పైగా జిమ్‌లు, ఫిట్‌నెస్ కేంద్రాల్లో యాక్సెస్ లభిస్తుంది.
నెలకు గరిష్ఠంగా 12 సెషన్స్ (వారానికి మూడు, రోజుకు ఒక సెషన్) వరకు అనుమతిస్తారు.
* ఫిట్‌కోచ్, ఫిట్‌ఫీస్ట్ సభ్యత్వం. ఫిట్‌పాస్ మొబైల్ అప్లికేషన్‌లో రోజువారీ ఫిట్‌నెస్
కోచింగ్, పోషకాహార నిపుణులు అందుబాటులో ఉంటారు.
* ఏడాది పాటు నెట్‌మెడ్స్ ఫస్ట్
సభ్యత్వం లభిస్తుంది. ఇందులో ఏడాది పాటు ఆన్‌లైన్‌లో డాక్టర్‌ను ఎన్ని
సార్లయినా సంప్రదించొచ్చు. వార్షికంగా సాధారణ హెల్త్ చెక్-అప్‌లు ఉంటాయి. ప్రతి
ప్రీపెయిడ్ ఆఫర్‌పై అదనంగా 2.5 శాతం (రూ. 100 వరకు) ఎన్‌ఎంఎస్ నగదు, పాథాలజీ ల్యాబ్ పరీక్షలపై
అదనంగా 5 శాతం తగ్గింపు, అపరిమిత
ఫ్రీ డెలివరీ ఇవ్వడంతో పాటు.. సభ్యులకు ప్రాధాన్యం ఇస్తారు.
0 Komentar