Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI CBO Recruitment 2021: Apply for 1226 Circle Based Officer Posts - Details Here

 

SBI CBO Recruitment 2021: Apply for 1226 Circle Based Officer Posts - Details Here

ఎస్‌బి‌ఐ లో 1226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ల ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం కింది రెగ్యులర్, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 1226 (రెగ్యులర్-1100, బ్యాక్ లాగ్-126)

అర్హత: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.12.2021 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 01.12.2000 - 02.12.1991 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్), స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: రాత పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ 120 మార్కులకు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ కి నెగిటివ్ మార్కింగ్ లేదు.

* డిస్క్రిప్టివ్ టెస్ట్ ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్) నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.12.2021.

దరఖాస్తులకు చివరి తేది: 29.12.2021.

ఆన్లైన్ టెస్ట్: జనవరి 2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags