SBI YONO, UPI, Net Banking to be
Unavailable Tomorrow - Details Here
ఎస్‌బీఐ: రేపు ఈ సమయంలో ఇంటర్నెట్
బ్యాంకింగ్ సేవలతో పాటు యోనో, యోనో లైట్, యూపీఐ
సేవలకు అంతరాయం!
బ్యాంకింగ్
దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ సేవలకు
శనివారం కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్
బ్యాంకింగ్ సేవలతో పాటు యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని ఎస్‌బీఐ తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం వేకువ జామున 4.30 వరకు (300 నిమిషాలు) ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్
ఖాతాలో వెల్లడించింది.
సాంకేతిక అప్‌గ్రేడేషన్
ప్రక్రియలో భాగంగా సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఎస్‌బీఐ పేర్కొంది. మెరుగైన
బ్యాంకింగ్ సేవలు అందించే ఈ ప్రయత్నంలో కలుగుతున్న ఈ అసౌకర్యానికి సహకరించాలని
ఖాతాదారులను ఎస్‌బీఐ కోరింది. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐకి 22వేల
బ్యాంక్ శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్ 8న సైతం ఇదే తరహాలో మెయింటెనెన్స్‌లో భాగంగా ఎస్‌బీఐ ఇంటర్నెట్ సేవలకు
కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడింది.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/LZsuqO2B0D
— State Bank of India (@TheOfficialSBI) December 10, 2021
0 Komentar