Sensex down over 1,600 points, Nifty
below 16,500 amid weak global cues
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్
మార్కెట్లు - 1600 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
దేశీయ మార్కెట్లపై బేర్ పట్టు
బిగించింది. ఓవైపు ఐరోపా సమాఖ్య దేశాల్లో ఒమిక్రాన్ భయాలు.. మరోవైపు ప్రభుత్వ
నిర్ణయాలు సూచీలను కుదిపేశాయి. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాల ప్రతికూల సంకేతాలు
మార్కెట్లను మరింత దెబ్బకొట్టాయి. దీంతో సూచీలు సోమవారం నాటి ట్రేడింగ్‌ను భారీ
నష్టాలతో ప్రారంభించాయి.
20-12-2021 - MORNING
సెన్సెక్స్ ఏకంగా 1300 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 16,600 పాయింట్లకు దిగువన ట్రేడ్ అవుతోంది. ట్రేడింగ్ ఆరంభంలోనే మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో కేవలం 15 నిమిషాల్లో వ్యవధిలో రూ.5.2లక్షల కోట్ల మేరకు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.
ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా
నష్టపోయింది. దీంతో బీఎసీఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5.19లక్షల కోట్లు తగ్గి రూ.254.08లక్షల కోట్లకు
పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లు మరింత పతనమయ్యాయి. ఉదయం 11.00 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1314 పాయింట్లు కుంగి 55,697 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు
దిగజారి 16,589 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 3.54శాతం మేర పతనమైంది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. లోహ,
రియల్టీ, ఆటోమొబైల్, బ్యాంకింగ్
సూచీలు భారీగా కుదేలవుతున్నాయి.
ద్రవ్యోల్బణ భయాలు, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పాటు వరి, గోధుమ, శనగలు, ఆవాలు, సోయాబీన్స్, ముడి పామాయిల్, పెసర్ల కమోడిటీ ట్రేడింగ్‌ను ఏడాది పాటు నిలిపివేయాలని కేంద్రం వెలువర్చిన ఆదేశాలు సూచీలపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సూచీల సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.
20-12-2021 - AFTERNOON
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం
భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో సూచీలు భారీగా
పతనమవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లు కోల్పోగా..
నిఫ్టీ 500 పాయింట్లు దిగజారింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల
సంకేతాలతో పాటు, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల, ద్రవ్యోల్బణ
భయాలు సూచీలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో
వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. 1000
పాయింట్లకు పైగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్ అంతకంతకూ దిగజారుతోంది.
ప్రస్తుతం 12.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1665 పాయింట్లు పతనమై 55,346 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు
నిఫ్టీ 506 పాయింట్లు కుంగి 16,478
వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంక్ 4.05 శాతం మేర పతనమైంది.
0 Komentar