SSC CGL Recruitment 2021: Notification Released
– Apply online for Group B, C Posts - Check the Details Here
ఎస్‌ఎస్‌సి - కంబైన్డ్
గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ 2021 – ముఖ్యమైన వివరాలు ఇవే
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్
గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) 2021 పరీక్ష ప్రకటన విడుదల చేసింది.
దీని ద్వారా వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి
పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
2. అసిస్టెంట్ అకౌంట్స్
ఆఫీసర్
3. అసిస్టెంట్ సెక్షన్
ఆఫీసర్
4. అసిస్టెంట్
5. అసిస్టెంట్/
సూపరింటెండెంట్
6. ఇన్ స్పెక్టర్ (సెంట్రల్
ఎక్సైజ్)
7. ఇన్ స్పెక్టర్
(ప్రివెంటివ్ ఆఫీసర్)
8. ఇన్ స్పెక్టర్
(ఎగ్జామినర్)
9. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్
మెంట్ ఆఫీసర్
10. సబ్ ఇన్ స్పెక్టర్
11. ఇన్ స్పెక్టర్ పోస్ట్స్
12. డివిజనల్ అకౌంట్స్
13. ఇన్ స్పెక్టర్
14. సబ్ ఇన్ స్పెక్టర్
15. జూనియర్ స్టాటిస్టికల్
ఆఫీసర్
16. ఆడిటర్
17. అకౌంటెంట్
18. అకౌంటెంట్/ జూనియర్
అకౌంటెంట్
19. సీనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్/ యూడీసీ
20. టాక్స్ అసిస్టెంట్
21. అప్పర్ డివిజన్ క్లర్క్
22. రిసెర్చ్ అసిస్టెంట్
29. ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్
కమ్ ట్యా క్స్
అర్హత:
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్
అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, చార్టర్డ్
అకౌంటెన్సీ లేదా కాస్ట్ & మేనేజ్ మెంట్ అకౌంటెంట్స్ లేదా
కంపెనీ సెక్రటరీ/ ఎంకాం/ ఎంబీఏ(ఫైనాన్స్)/ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్
ఉత్తీర్ణులై ఉండాలి.
* జూనియర్ స్టాటిస్టికల్
ఆఫీసర్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు 60 % ఉత్తీర్ణతతో
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 10+2లో మేథమేటిక్స్ సబ్జెక్టుగా
చదివి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్ లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివిన
అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* మిగిలిన అన్ని పోస్టులకూ
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయసు: పోస్టులను అనుసరించి 18
నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్షా కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్: కడప, కర్నూలు,
చీరాల, గుంటూరు, కాకినాడ,
నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి,
విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్,
వరంగల్
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక నాలుగు అంచెలుగా జరుగుతుంది. నాలుగో అంచె (టయర్-4) కొన్ని పోస్టులకు మాత్రమే. అభ్యర్థులందరూ మూడు అంచెల విధానాన్ని పాటించాల్సిందే. టయర్ -1 పరీక్షకు 1 గంట సమయం ఉంటుంది. టయర్ - 2 పరీక్షకు 2 గంటల సమయం ఉంటుంది.
టయర్ – 3:
టయర్ - 3
పరీక్ష పెన్ అండ్ పేపర్ మోడ్ లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష రాయాల్సి
ఉంటుంది. 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. 1 గంట సమయం ఉంటుంది.
టయర్ - 4: కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ), డేటా
ఎంట్రీ స్పీడ్ టెస్ట్ (డీఈఎసీ) నిర్వహిస్తారు. ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ మహిళలకు ఫీజు లేదు.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 23.01.2022.
* టయర్-1 కంప్యూటర్ రాతపరీక్ష: ఏప్రిల్, 2022.
* టయర్-2 పరీక్ష:
పరీక్ష తేదీ తేదీ వెల్లడించాల్సి ఉంది.
0 Komentar