Top Wikipedia Pages Of 2021: This Year's
10 Most Visited Articles
వికీపీడియాలో 2021 లో అత్యధికంగా చదివిన టాప్ 10 పేజీలెంటో తెలుసా?
అంతర్జాలం లో (ఇంటర్నెట్‌లో) ఏదైన సమాచారం తెలుసుకోవాలంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘వికీపీడియానే (Wikipedia)’. వికీపీడియా పేజీని ఏ వ్యక్తి అయినా, ఎక్కడి నుంచైనా ఎడిట్ చేయవచ్చు. తప్పులు ఉంటే సరిచేయవచ్చు. అందువల్లే కచ్చితమైన సమాచార వ్యాప్తిలో వికీపీడియా ప్రపంచ అతిపెద్ద కమ్యూనిటీ వ్యవస్థగా నిలిచింది. మరి సమాచార టెక్ భాండాగారంగా ప్రసిద్ధి చెందిన ఈ ‘వికీపీడియా’లో.. ఈ ఏడాది (2021) వీక్షకులు అత్యధికంగా చదివిన టాప్ 10 పేజీలెంటో తెలుసా?
1. అగ్రస్థానంలో ‘డెత్స్
ఇన్ 2021’
‘డెత్స్ ఇన్ 2021 (Deaths in 2021)’ వికీపీడియా పేజీని ఈ ఏడాది అత్యధికంగా 4.27 కోట్ల (4,27,48,490) మంది చదివారు. ప్రపంచవాప్తంగా 2021లో మరణించిన ప్రముఖల జాబితా (ఇంగ్లాండ్ ప్రిన్స్ ఫిలిప్ నుంచి హాలీవుడ్ నటి జెస్సికా వాల్టర్ వరకు) ఇందులో ఉంది.
2. సెకండ్ మోస్ట్ రీడ్‌లో రాణి ఎలిజబెత్-2
బ్రిటన్ చరిత్రలోనే అత్యధిక కాలం రాణి హోదాలో కొనసాగుతున్న ఎలిజబెత్-2 (95) పేజీ ఈ ఏడాది టాప్ సెకండ్ మోస్ట్ రీడ్‌లో నిలిచింది. 2021లో రాణి ఎలిజబెత్-2 (Elizabeth II) సంబంధిత ఆర్టికల్‌ను 2021లో 2.52 కోట్ల (2,52,90,406) మంది వీక్షించారు. అయితే, రాణి ఎలిజబెత్-2 పేజీని అత్యధిక ఇంత మంది చదవడానికి ఓ సంచలన కారణం ఉంది. అదెంటంటే.. రాణి ఎలిజబెత్-2 మరణించిన అనంతరం చేపట్టేబోయే పలు కార్యకమ్రాలు పత్రాలు ఈ ఏడాది లీకయ్యాయి. ఇందుకు సంబంధించిన వార్తల కథనాలను ప్రపంచ వ్యాప్తంగా అన్ని పత్రికలు ప్రధానాంశాలుగా ప్రచురించాయి.
3. ఎలాన్‌కు సరిలేరెవరు..!
స్పేస్ఎక్స్, టెస్లా కార్ల సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఈ ఏడాది ప్రతివారం ఏదో ఒకవిధంగా వార్తల్లో నిలిచారు. ట్విటర్‌లో అతని టెక్స్ట్, క్రిప్టోకరెన్సీని అంగీకరించడం, SpaceX విజయాలు, టెస్లా కార్లు, టైమ్ మేగజీన్ ఎలాన్‌ను ఈ ఏటి మేటి వ్యక్తిగా (పర్సన్ ఆఫ్ ద ఇయర్-2021గా) ప్రకటించడం వంటివి 2021లో ప్రధాన వార్తలే. సంపద విషయంలో ప్రపంచ కుబేరుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను మస్క్ ఇటీవలే అధిగమించారు కూడా. ఇలాంటి ప్రధానమైన వార్తల నేపథ్యంలో ఎలాన్ మస్క్ వికీపీడీయాకు 2.41 కోట్ల వ్యూస్ లభించాయి.
4. ‘స్క్విడ్ గేమ్’
వ్యూస్ @ 2.18 కోట్లు
ప్రస్తుతం ఏ దేశంలో చూసిన ‘స్క్విడ్ గేమ్ (Squid Game)’ వెబ్ సిరీస్ గురించే చర్చ. సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్‌సిరీస్ విడుదలైన 90 దేశాల్లో నెం.1గా కొనసాగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై తక్కువ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. ఈ ఘనతతో పాటే 2.18 కోట్ల వీక్షణలతో వికీపీడియాలో ‘స్క్విడ్ గేమ్’ నాలుగో స్థానంలో నిలిచింది.
5. రికార్టు గోల్స్‌తో
ఐదోస్థానంలో..
ఉర్రూతలూగించే ఫుడ్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డొ (Cristiano Ronaldo) వికీపీడియా పేజీకి ఎప్పటిలాగే ఈసారీ ఆదరణ లభించింది. 1.87 కోట్ల వ్యూస్‌తో రొనాల్డొ వికీపీడియా పేజీ ఈ ఏడాది ఐదో స్థానంలో నిలిచింది. ఈ మధ్యే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ (111) సాధించిన ఏకైక ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డొ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ అర్హత మ్యాచులో ఈ పోర్చుగల్ స్టార్ రెండు గోల్స్ కొట్టి ఈ ఘనత సాధించాడు.
6. ప్రిన్స్ ఫిలిప్
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) ఈ ఏడాది ఏప్రిల్ 9న కన్నుమూసిన విషయం విధితమే. గుండె సంబంధిత ఆపరేషన్ తర్వాత కోలుకుని ప్యాలెస్‌కు చేరుకున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రిన్స్ ఫిలిప్ (Prince Philip) వికీపీడియాను 1.81 కోట్ల మంది చదివారు. గ్రీకు రాకుమారుడైన ఫిలిప్ 1947లో ఎలిజెబెత్‌ను వివాహం చేసుకుని బ్రిటన్ రాజ్యానికి వచ్చారు. అప్పటి నుంచి రాణి వెన్నంటి ఉంటూ పాలనపరంగా అన్నివిధాలా సహాయ సహకారాలు అందించారు.
7. తగ్గేదేలే..!
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ ఆటకు ఉన్న అభిమానుల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటా ఫుట్‌బాల్‌కు ఆదరణ అంతకంతకు పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. ఈసారి 16వ యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టోర్నీ (UEFA Euro 2020)లో ఇటలీ ఛాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌పై 3-2 తేడాతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్‌ను మరోసారి ముద్దాడింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టోర్నీ పేజీని ఈ ఏడాదిని 1.74 కోట్ల మంది వీక్షించారు.
8. అమెరికా
ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా (United States) ఈ ఏడాది తరచూ వార్తల్లో నిలిచింది. 2021లో అమెరికాలో చాలా మార్పులు జరిగాయి. నూతన అధ్యక్షుడిగా జో బైడన్ ఎన్నిక నుంచి యూఎస్ కాపిటల్ ముట్టడి, తిరుగుబాటు దారులపై కాల్పులు, అఫ్గాన్‌లో యూఎస్ బలగాల ఉపసంహరణ వంటి పెద్దన్న నిర్ణయాలతో అమెరికా వికీపీడియా పేజీని 1.71 కోట్ల మంది చదివారు. దీంతో ఈ ఏడాది టాప్ 10 వికీపీడీయా పేజీల్లో అమెరికా 8 స్థానంలో నిలిచింది.
9. జో బైడన్
మరోవైపు 46వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ (Joe Biden) వికీపీడియా 1.68 కోట్ల వ్యూస్‌తో 9వ స్థానంలో నిలిచారు.
10. డొనాల్డ్ డ్రంప్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ డ్రంప్ (Donald Trump) పేజీ
1,.63 కోట్ల వ్యూస్‌తో పదో స్థానంలో నిలవడం విశేషం.
0 Komentar