TS: Four Year Integrated Courses (B.A., B.Ed.
and B.Sc., B.Ed.) - Details Here
టిఎస్: నాలుగేళ్ల
ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు – దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – ముఖ్యమైన
వివరాలు ఇవే
జాతీయ నూతన విద్యా విధానంలో (NEP-2020) పొందుపరిచిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు రాష్ట్రంలో
అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో డిగ్రీ పూర్తయిన తర్వాతే బీఈడీ
చదివేందుకు వీలుండేది. ఇక నుంచి ఇంటర్ పూర్తయిన విద్యార్థులు కూడా ఉపాధ్యాయ
విద్యలోకి ప్రవేశించవచ్చు. నారాయణ పేటలోని శ్రీదత్త బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
టీచర్ ఎడ్యుకేషన్లో బీఏ-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సులకు
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) అనుమతి ఇవ్వగా పాలమూరు విశ్వవిద్యాలయం
నుంచి అనుబంధ గుర్తింపు దక్కింది.
ఇంటర్ విద్యార్హత ఆధారంగా సీట్లను
భర్తీ చేస్తారు. ఒక్కో కోర్సులో 100 సీట్లు ఉంటాయి. ప్రవేశాల కోసం
నోటిఫికేషన్ జారీ చేశామని, డిసెంబరు 24 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్
ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్ సెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేష్ బాబు
తెలిపారు. జనవరి 2న
సీట్లు కేటాయిస్తామని, 10 నుంచి తరగతులు మొదలవుతాయన్నారు.
మరిన్ని వివరాలను వెబ్ సైట్ ద్వారా పొందొచ్చని ఆయన తెలిపారు.
0 Komentar