TSBIE: Inter First Year Results Released
TSBIE: తెలంగాణ ఇంటర్
ఫస్టియర్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి
సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయి. మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు
ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫలితాల్లో 56 శాతం బాలికలు, 42
శాతం బాలురు ఉత్తీర్ణులైనట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 4,59,242
మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. వారిలో 2,24,012 మంది విద్యార్థులు
ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్
దరఖాస్తులకు ఈ నెల 22 వరకు గడువు విధించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఫలితాలను ఇంటర్ వెబ్‌సైట్‌లో ఫలితాలను ఉంచినట్లు బోర్డు తెలిపింది. అంతేకాకుండా http://results.cgg.gov.in వెబ్‌సైట్‌లోనూ చూడొచ్చు.
డిసెంబరు 17వ తేదీ సాయంత్రం 5గంటల
తర్వాత విద్యార్థులు మార్కుల వివరాలను పైన తెలిపిన వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు.
రీకౌంటింగ్ కోసం పేపర్‌కు రూ.100, స్కాన్ కాపీతో పాటు
రీవెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు పేపర్‌కు రూ.600 ఫీజు చెల్లించి ఈ సేవలు
పొందవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
1ST YEAR
GENERAL BRIDGE COURSE
1ST YEAR VOCATIONAL
BRIDEGE COURSE
0 Komentar