UPSC NDA & NA (I) Exam 2022: Final Results Released
యూపిఎస్‌సి – ఎన్‌డిఏ&ఎన్‌ఏ-1 ఎగ్జామ్ 2022: తుది ఫలితాలు విడుదల
=========================
UPDATE 18-11-2022
UPSC నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నావల్ అకాడమీ (NA) ఎగ్జామ్ (I) ఫైనల్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 519 మంది క్వాలిఫై అయ్యారు. అభ్యర్థులు UPSC
వెబ్సైట్లో చూసుకోవచ్చు. క్వాలిఫై అయిన అభ్యర్థులకు సర్వీస్
సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అందులో ఎంపికైన అభ్యర్థులకు NDA 149వ కోర్సులో, NAలో 111వ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
=========================
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
(యూపీఎస్సీ)..149వ కోర్సు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఏ),
111వ ఇండియన్ నావల్ అకాడమీ కోర్సుల్లో(ఎన్ఏ) ప్రవేశానికి అవివాహిత
పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు ..
National Defence Academy and Naval
Academy Examination (I), 2022
ఎన్‌డిఏ అండ్ ఎన్ఏ (1) ఎగ్జామ్, 2022
మొత్తం ఖాళీలు: 400
1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ
(ఎన్ డీఏ): 370 (ఆర్మీ-208, నేవీ-42,
ఎయిర్ ఫోర్స్-120)
2) నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 30
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకి
ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ,
మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2003 జులై 2 - 2006 జులై 1 మధ్య
జన్మించి ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఎస్ఎస్ బీ టెస్ట్/ ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్,
హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ప్రకటనలో
సూచించిన అభ్యర్థులకు ఫీజు
లేదు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 22.12.2021
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 11.01.2022.
ఆన్లైన్ దరఖాస్తుల ఉపసంహరణ తేది: 18.01.2022 నుంచి 24.01.2022.
పరీక్ష తేది: 10.04.2022.
కోర్సు ప్రారంభం: 02.01.2023
0 Komentar