World Athletics Awards Anju Bobby George
as 'Woman of The Year'
భారత మాజీ మహిళా అథ్లెట్ అంజూ
బాబీ జార్జీకి ''వుమెన్ ఆఫ్ ది ఇయర్-2021'' అవార్డు
భారత మాజీ మహిళా అథ్లెట్ అంజూ
బాబీ జార్జీకి అరుదైన గౌరవం దక్కింది. అథ్లెట్ విభాగంలో ఆమె చేసిన సేవలకు గాను
వరల్డ్ అథ్లెటిక్స్ 2021 ఏడాదికి గానూ ''వుమెన్
ఆఫ్ ది ఇయర్'' అవార్డుతో సత్కరించింది. లాంగ్‌జంప్‌లో
ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించిన ఆమె రిటైర్మెంట్ తర్వాత 2016లో అమ్మాయిల కోసం ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి శిక్షణ ఇచ్చింది. కాగా
ఇప్పటికే అండర్ 20 విభాగంలో అంజూ బాబీ జార్జీ శిక్షణలో
రాటుదేలిన పలువురు యువతులు మెడల్స్ కూడా సంపాదించారు.
ఎంతోమంది భారతీయ యువతులకు ఆదర్శంగా
నిలిచిన అంజూబాబీ జార్జీ.. ''వుమెన్ ఆఫ్ ది ఇయర్'' అవార్డుకు అర్హురాలని ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో
తెలిపింది. ఇక మెన్స్ విభాగంలో ఒలింపియన్స్ అయిన జమైకాకు చెందిన ఎలైన్ థాంప్సన్..
నార్వేకు చెందిన కార్‌స్టెన్ వార్లోమ్‌లు ''వరల్డ్ అథ్లెట్
ఆఫ్ ది ఇయర్'' అవార్డుకు ఎంపికయ్యారు.
అంజూ బాబీ జార్జీ లాంగ్‌జంప్
విభాగంలో ఎన్నో పతకాలు సాధించింది. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం.
►2003 పారిస్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో లాంగ్‌జంప్ విభాగంలో కాంస్య పతకం
►2005 వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్లో బంగారు పతకం
►2002 మాంచెస్టర్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్యం
►2002 బుసాన్, 2006 దోహా ఆసియా క్రీడల్లో స్వర్ణం,
రజతం
►2005 ఇంచియాన్, 2007 అమ్మన్ ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో
స్వర్ణం, రజతం
Congratulations to @anjubobbygeorg1 on being crowned this year's Woman of the Year at the #WorldAthleticsAwards
— World Athletics (@WorldAthletics) December 1, 2021
Her efforts in advancing the sport in India as well as inspiring more women to follow in her footsteps make her more than a worthy recipient of this year's award. pic.twitter.com/5TSWxj4vqt
0 Komentar