Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

కేబినెట్‌ సమావేశం: పలు అంశాలకు కేబినెట్‌ ఆమోదం - క్యాబినెట్ నిర్ణయాలు ఇవే

 

కేబినెట్‌ సమావేశం: పలు అంశాలకు కేబినెట్‌ ఆమోదం -  క్యాబినెట్ నిర్ణయాలు ఇవే

ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 

క్యాబినెట్ నిర్ణయాలు

* పీఆర్సీ సహా పలు కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

* ఉద్యోగులు రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

* ఉద్యోగులకు జగనన్న టౌన్‌షిప్ లలో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రతిపాదనకు  ఆమోదం తెలిపిన కేబినెట్‌.. టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్లాట్లు 20 శాతం రిబెట్ తో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

* ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ ఏర్పాటుకు నిర్ణయం

* ఈబీసీ నేస్తం అమలుకు క్యాబినెట్ ఆమోదం

* అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం

* ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం

* కిదాంబి శ్రీకాంత్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు

* విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం

* వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ మెడికల్‌ కాలేజీ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం

* కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

* వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు ఈ ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదం సమ్మతించింది.

* మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్టుకు పౌష్టికాహారం బాలామృతం, పాలు సరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags