AP
Covid-19 Media Bulletin 11-01-2022
ఏపీలో
కొత్తగా 1,831 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 36,452
పరీక్షలు నిర్వహించగా.. 1,831 కేసులు నిర్ధారణ
అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,84,674 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన
24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల ఎలాంటి మరణం సంభవించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా
మృతుల సంఖ్య 14,505 తోనే ఉంది.
24 గంటల వ్యవధిలో 242 మంది బాధితులు కోలుకోవడంతో
రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,62,974
చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,195 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,16,66,683
నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Previous
Day Bulletin 👇
0 Komentar