ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ని
ప్రకటించిన ఏపీ సర్కార్ - ఉద్యోగుల పదవీ
విరమణ వయసు పెంపు
గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంది.
====================
PRC 2021 READY RECKONER (REFERENCE) 👇
======================
పీఆర్సీ ప్రకటన - ముఖ్యాంశాలు ఇవే:
►ఈ మేరకు 23.29 శాతం పీఆర్‌సీని
ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
►ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60
నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
►పెంచిన జీతాలు 2022 జనవరి 1
నుంచి అమల్లోకి రానున్నాయి.
►పెండింగ్ డీఏలు జనవరి నుంచి
చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
►2020 ఏప్రిల్ నుంచి కొత్త
పీఆర్సీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
►జూన్ 30లోపు కారుణ్య నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
►గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్
30లోపు ప్రొబేషనరీ డిక్లరేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు.
►సీపీఎస్‌కు కూడా సంబంధించి
టైంలైన్ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్ సబ్‌కెమిటీ వేశాం. జూన్ 30లోగా ఒక
నిర్ణయం తీసుకుంటున్నాం.
►సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు
రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధిచేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే
అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును
ఇవ్వాలని నిర్ణయించారు.
►కోవిడ్ కారణంగా
మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు
కల్పిస్తున్నాం. జూన్ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని
అధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
►ఈహెచ్‌ఎస్ –
ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్ సెక్రటరీ
అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి 2 వారాల్లో సమస్యలు
పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.
►గ్రామ, వార్డు
సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా
ప్రొబేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూ పేస్కేలు)ఈ ఏడాది జులై జీతం
నుంచి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.
►ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు, పీఎఫ్, జీఎల్ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితరాలన్నీ కూడా ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు.
===================
11వ వేతన సవరణ సంఘం నివేదిక
అమలు, ఇతర 71 డిమాండ్ల నేపథ్యంలో
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్
స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నుంచి
సీఎం జగన్ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక శాఖ
అధికారులతో పీఆర్‌సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లోగానే పీఆర్సీ
పై నిర్ణయం తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పీఆర్‌సీ
ప్రకటించారు.
0 Komentar