Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

కారుణ్య నియామకాలు: జూన్ 30లోగా కారుణ్య నియామకం గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

 

కారుణ్య నియామకాలు: జూన్ 30లోగా కారుణ్య నియామకం గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

కొవిడ్ తో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద జూన్ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు.. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి హోదాతో నియామకం చేపట్ట నున్నట్లు పేర్కొన్నారు.

కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నియామకాలను 2021 నవంబరు 31లోగా చేపట్టాలని నిర్ణయించినా పెద్ద మొత్తంలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.

త్వరితగతిన వీటిని పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం ఇవ్వనున్నారు.

దరఖాస్తులు పరిశీలించి, తక్షణం ఖాళీలను భర్తీ చేయాలని కలెక్టర్లకు సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags