Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

కొత్త పీఆర్సీ, 5 డి‌ఏ లు మరియు పొరుగు సేవల వేతనాల పై ప్రభుత్వ ఉత్తర్వులు (G.Os) విడుదల

 

కొత్త పీఆర్సీ, 5 డి‌ఏ లు మరియు పొరుగు సేవల వేతనాల పై ప్రభుత్వ ఉత్తర్వులు (G.Os) విడుదల

పీఆర్సీ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు

* సవరించిన మాస్టర్ స్కేలులో 32 గ్రేడులు ఉంటాయి. 2018 జులై 1 నుంచి నోషనల్ గా కొత్త పీఆర్సీ అమలవుతుంది. 2022 జనవరి నుంచి కొత్త జీతాల్లో పీఆర్సీ అమలు ప్రభావం ఉంటుంది.

* 2022 సవరించిన వేతన స్కేళ్లు నిర్ణయించే క్రమంలో మధ్యంతర భృతిని పరిగణనలోకి తీసుకోరు.

* సచివాలయ ఉద్యోగులతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఉద్యోగులకు 16% అద్దె భత్యం. మిగిలిన అందరికీ 8% అద్దెభత్యం వర్తిస్తుంది.

* ఆటోమేటిక్ అడ్వాన్సుమెంట్ స్కీం 6, 12, 18, 24తో 30గా కొనసాగింపు.

* గ్రాట్యుటీ పరిమితి రూ.16 లక్షలకు పెంపు.

* ఇక కేంద్ర ప్రభుత్వ తరహాలోనే కొత్త పీఆర్సీ.

* ఇంటి అద్దె భత్యం (HRA) లో కోత.

* సీసీ‌ఏ (CCA) రద్దు.  

=====================

50 లక్షలకు పైబడి జనాభా ఉండే నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు బేసిక్‌ స్కేలుపై 24 శాతం హెచ్‌ఆర్‌ఏ, 5–50 లక్షల మధ్య జనాభా ఉండే నగరాలు, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం, 5 లక్షల లోపు జనాభా ఉండే పట్టణాలు, గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులకు 8 శాతం హెచ్‌ఆర్‌ఏగా నిర్దారిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఐఏఎస్‌ అధికారులతో పాటు యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ డిగ్రీ కాలేజీలలో యూజీసీ వేతనాలతో పనిచేసే వారికి రివైజ్డ్‌ హెచ్‌ఆర్‌ఏ వర్తించదని తెలిపారు. 

కన్సాలిడేటెడ్‌ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌దారులకు కూడా కొత్త పీఆర్సీ అమలు ప్రకారం 23 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.

1993 నవంబరు 25వ తేదీకి ముందు ఎన్‌ఎంఆర్, పార్ట్‌టైం ఉద్యోగులుగా చేరిన వారికి కూడా కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు అమలు చేస్తూ ఇంకో ఉత్తర్వు జారీ చేశారు. 

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో కేటగిరీ–1లో పేర్కొన్న వారికి రూ.21,500 చొప్పున, కేటగిరీ–2 వారికి రూ.18,500, కేటగిరీ–3 వారికి రూ.15,000 చొప్పున కొత్త వేతనాన్ని అమలు చేస్తూ జీవో జారీ చేశారు. 

=====================

పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల పెంపు 

రాష్ట్రంలో నాలుగు కేటగిరీల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలను పెంచారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అయితే ఏపీ పొరుగు సేవల సంస్థ పరిధిలోని వారికే ఈ పెంపు వర్తిస్తుంది.

* కేటగిరీ 1లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్ లేటర్, డేటా ప్రాసెసింగ్ అధికారులకు గతంలో ఉన్న రూ.17,500 నుంచి ఇప్పుడు రూ.21,500కు పెంచారు.

* కేటగిరీ 2లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, డ్రైవర్, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటో గ్రాఫర్, డేటా ఎంట్రీ ఆఫీసర్, డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్, ఫిట్టర్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా ఆడియో విజువల్ ఆపరేటర్, సూపర్‌వైజర్, మేనేజర్ వంటి వారికి రూ. 15,000గా ఉన్న వేతనాన్ని రూ.18,500కు పెంచారు. * కేటగిరీ 3లోని ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, మాలి, కామటి, కుక్, చౌకీదార్, సైకిల్ ఆర్డర్లీ, లిఫ్ట్ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, డఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, షరాఫ్/క్యాషియర్లకు రూ.12,000గా ఉన్న వేతనాన్ని రూ. 15వేలకు పెంచారు.

ఒప్పంద ఉద్యోగుల మినిమమ్ టైం స్కేలు

ఒప్పంద ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేలును పొడిగిస్తూ (ఎక్స్టెన్షన్) ఉత్తర్వులిచ్చారు.

1998కు ముందు చేరిన వారికీ

25-11-1993కు ముందు నియమితులైన పూర్తికాల (ఫుల్ టైం) /ఎస్ఎంఆర్/ రోజువారీ వేతనదారులు/ కన్సాలిడేటెడ్ పే/ పార్ట్ టైం ఉద్యోగులకూ మినిమం టైం స్కేలుకు సమానంగా ఇచ్చే వేతనాలను కొత్త వేతన సవరణలోనూ కొనసాగిస్తున్నట్లు రావత్ మరో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

================

అన్నీ G .O ల వివరాలు 👇

RPS – GO 1

PENSIONS – GO 2

OUTSOURCE SALARIES – GO 7

5 DAs – GO 8

PENSIONS – DR – GO 9

MTS – GO 6

CONTRACT EMPLOYEES – GO 5

Previous
Next Post »
0 Komentar

Google Tags