AP: Tenth Marks Memos will be Available on
Digital Locker App and Website
ఏపి: ఇక
డిజిటల్ లాకర్ యాప్ మరియు వెబ్సైట్ లలో పదో తరగతి మెమోలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన
డిజిటల్ లాకర్ విధానంలోకి ప్రభుత్వ పరీక్షల విభాగం వెళ్లబోతోంది. అభ్యర్థులు
ఎప్పుడైనా తమ మెమోను ఆన్ లైన్లో పొందవచ్చు. పది పరీక్షల ఫలితాలు విడుదలైన వెంటనే
మెమోలు ఆన్‌లైన్లో అందుబాటులోకి వస్తాయి. ఆఫ్ లైన్ విధానంలోనూ మెమోలు జారీ
చేస్తుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని సీబీఎస్ఈ బోర్డు అమలు చేస్తోంది. ఆన్ లైన్ లో
డౌన్ లోడ్ చేసుకుని, పీడీఎఫ్ రూపంలో ఫోన్ లోనూ ఉంచుకోవచ్చు. ఈ
డిజిటల్ లాకర్ విధానం 45 రోజుల్లో అందుబాటులోకి రానుంది.
2004 నుంచి జారీ చేసిన
మార్కుల జాబితాలను ఆన్లైన్లో ఉంచనున్నారు. అంతకుముందు జారీ చేసిన మెమోల డేటానూ
ఉంచేందుకు పరిశీలన చేస్తున్నారు. ఆధార్‌కార్డు, హాల్ టికెట్
నంబర్ల ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల ఫలితాలతో పాటే
ఆన్ లైన్ మెమోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
ఈ డిజిటల్ లాకర్ యాప్ మరియు వెబ్సైట్
లో రాష్ట్రం మరియు కేంద్రం విడుదల చేసే, మన ఐడి కార్డులను కూడా సేవ్
చేసుకోవచ్చు. ఫలితంగా మన దగ్గర ఆ కార్డు లేకున్నా మొబైల్ లో చూసుకోవచ్చు మరియు అవసరమైన
చోట ప్రూఫ్ గాను చూపించవచ్చు.
0 Komentar