మొబైల్ తో మీటర్ రీడింగ్ మరియు
బిల్లు కట్టే విధానం - ఈపీడీసీఎల్ సేవల వివరాలు ఇవే
స్మార్ట్ ఫోన్‌తో కరెంటు బిల్లు
కడుతున్నట్లుగానే అదే ఫోన్‌తో మీటర్ రీడింగ్ కూడా తీసేయొచ్చు. ప్రస్తుతం
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీడర్ల
ద్వారా జరుగుతోంది.
రీడింగ్ విధానం:
ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం
ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్‌ను ఇన్‌స్టాల్
చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్
ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల
విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్ట్టర్
సర్వీస్ నంబర్‌పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్
చేయాలి. దానిని సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్‌కు సమాచారం
వస్తుంది. ఈ యాప్‌లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం,
వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
0 Komentar